Mahesh Babu Rajamouli Movie Updates: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడి గా తన కెరియర్ ని మొదలుపెట్టిన రాజమౌళి ప్రస్తుతం ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. బాహుబలి సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించిన ఆయన తన సినిమాతో వరల్డ్ రేంజ్ కి దూసుకెళ్లాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే రాజమౌళి తో సినిమా చేస్తున్న ప్రతి హీరో కూడా దాదాపు రెండు సంవత్సరాలపాటు తన కస్టడీలోనే ఉంటారు. అలాంటిది మహేష్ బాబు మాత్రం రాజమౌళి రూల్స్ బ్రేక్ చేస్తూ తన ఇష్టం ఉన్నట్టుగా ట్రిప్ లకైతే తిరుగుతున్నాడు. ఇక న్యూ ఇయర్ వేడుక కోసం ఇటలీ వెళ్లిన ఆయన న్యూ ఇయర్ పార్టీని ఎంజాయ్ చేసి వస్తాడు. ఇక ఈ వెకేషన్ కి వెళ్లడానికి రాజమౌళి నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోయిన కూడా మహేష్ బాబు ఇలా తిరగడం పట్ల జక్కన్న కొంతవరకు ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది…
నిజానికి మహేష్ బాబు లుక్కుని సైతం ఎక్కడ కనిపించకుండా ఉంచి ఒకేసారి రివిల్ చేయాలనే ప్రయత్నం చేశాడు. కానీ మహేష్ బాబు మాత్రం వెకేషన్స్ కి వెళ్లకుండా ఉండలేకపోయాడు. కాబట్టి అతన్ని కట్టడి చేయడం జక్కన్న వల్ల కాలేదు. మొదటిసారి జక్కన్న మాటను బ్రేక్ చేసిన హీరోగా మహేష్ బాబు పేరైతే వినిపిస్తోంది.
ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఎంతటి విజయాన్ని సాధిస్తోంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇటలీకి వెళ్లిన మహేష్ బాబు జనవరి మొదటి వారంలో హైదరాబాద్ కు వచ్చి వారణాసి సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధమవుతారట.
ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి నుంచి ఒక సినిమా వస్తోంది అంటే ఆ మూవీ యావత్ ఇండియన్ ప్రేక్షకులందరిని మెప్పించే విధంగా ఉంటుందనే విషయం మనందరికి తెలిసిందే. ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తోంది. తద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి ఘనత వస్తోంది అనేది తెలియాల్సి ఉంది…