V Hanumantha Rao: రాజకీయాలలో చాలామంది ఉండి ఉండవచ్చు. అందులో కొంతమంది కీలకమైన పదవులలో కొనసాగుతూ ఉండవచ్చు. కొంతమంది రాజకీయాలకే సరికొత్త అర్ధాన్ని తీసుకొచ్చి ఉండవచ్చు. కానీ కొంతమంది మాత్రం రాజకీయాలకే సరికొత్త భాష్యాన్ని చెబుతుంటారు. వ్యూహాలు, ప్రతి వ్యూహాలను పక్కనపెడితే తమదైన మాట తీరుతో ఆకట్టుకుంటారు. అందులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు ఒకరు.
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడుగా పేరుపొందారు వి హనుమంతరావు. ఇప్పుడంటే ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ ఒకప్పుడు రాజకీయాలలో తనదైన శైలిని.. తనదైన వాగ్దాటిని ఆయన కొనసాగించారు. అందువల్లే ఆయనను చాలామంది ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా హైదరాబాద్ యాసలో సాగే ఆయన మాట తీరు చాలామందికి ఇష్టానికి కలిగిస్తుంటుంది. వి హనుమంతరావు తిట్టినా సరే చాలామంది నవ్వుకోవడం వెనక ఆయన మాట తీరే.
హైదరాబాద్ యాసలో మాట్లాడే హనుమంతరావు.. ఒక విషయాన్ని గట్టిగా పట్టుకుంటే మాత్రం చివరి వరకు వెళ్తుంటారు. అప్పట్లో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాపై వివాదాన్ని రగిలించింది ఆయనే. ఆ సినిమాకు హనుమంతరావు వల్ల విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది. ఫలితంగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇక హనుమంతరావు విమర్శ చేసే విషయంలో కూడా తనదైన శైలిని కొనసాగిస్తుంటారు. అందులో కొంతమేర హాస్యం ఉన్నప్పటికీ.. లోతుగా చూస్తే బలమైన విషయం ఉంటుంది.
హనుమంతరావు ప్రజా సమస్యలపై చాలావరకు పోరాటాలు చేశారు. కొన్ని సందర్భాలలో పోలీస్ స్టేషన్ దాకా వెళ్లి ఆందోళనలు కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హనుమంతరావు చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆయన ఓ ప్రజా సమస్యపై పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్లారు. ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తుండగా స్థానికంగా ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ వారించారు. దీంతో ఒక్కసారిగా హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాదు, తాను ప్రజా సమస్యపై ఫిర్యాదు చేస్తుంటే తీసుకోకపోవడం ఏంటని సిఐ మీద మండిపడ్డారు. అంతేకాదు హైదరాబాద్ యాసలో సీఐ మీద ఒకరకంగా మాటలతో దాడి చేశారు. చివరికి ఫోటో దిగుదాం దా అంటూ సిఐని పిలిచారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ వీడియో ఇప్పటికే లక్షల వీక్షణాలు సొంతం చేసుకుంది. ఈ వీడియో చూసిన వారంతా హనుమంతరావు స్టైలే వేరు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.
