United Breweries Beers: సాధారణంగా ఎండాకాలంలో బీర్లకు డిమాండ్ ఉంటుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో చలికాలంలోనూ బీర్లకు డిమాండ్ తగ్గలేదు. తెలంగాణ రాష్ట్రంలో యు బి గ్రూప్ (UB group) తయారుచేసే కింగ్ ఫిషర్(Kingfisher) బీర్లకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అయితే ఆ బీర్లు ప్రస్తుతం అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం బకాయిలు చెల్లించలేకపోవడం.. ధరలు పెంచడానికి ఒప్పుకోకపోవడంతో తయారీని నిలుపుదల చేస్తామని యుబి గ్రూప్ ప్రకటించింది. ప్రభుత్వం రేట్లు పెంచడం లేదని యు బి కంపెనీ స్పష్టం చేసింది. ఆ కంపెనీ కింగ్ ఫిషర్ సహా ఏడు రకాల బీర్లను తయారుచేస్తుంది.. అయితే ప్రస్తుతం కంపెనీ ప్రకటించిన నేపథ్యంలో తయారీ నిలిచిపోయినట్టు తెలుస్తోంది. కొద్దిరోజులు మాత్రమే కింగ్ ఫిషర్ బీర్లు ఉంటాయి.
సయోధ్య కుదిరితేనే
ప్రభుత్వం, యు బి గ్రూప్ మధ్య సయోధ్య కుదిరితేనే కింగ్ ఫిషర్ బీర్లు మందు బాబులకు అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. లేకపోతే ఆ రకమైన బీర్లు మార్కెట్లో లభించవు. మందుబాబులు కింగ్ ఫిషర్ బీర్లను ఇష్టంగా తాగుతుంటారు. మార్కెట్లో వాటికే విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అయితే ఆ బీర్లను తయారు చేయమని యు బి గ్రూప్ ప్రకటించిన నేపథ్యంలో మందుబాబులు ఆందోళన చెందుతున్నారు. ” ఇతర బీర్లు తాగితే కషాయం తాగినట్టు ఉంటుంది. కింగ్ ఫిషర్ బీర్లలో నాణ్యత బాగుంటుంది. తాగినప్పుడు ఆహ్లాదంగా ఉంటుంది. శరీరం కూడా బాగుంటుంది. కానీ ఇప్పుడు ఆ బీర్లు అందుబాటులో ఉండవని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడే కాదు, కొంతకాలం నుంచి ఆ రకం బీర్లు అందుబాటులో లేవు. మేమైతే మా జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాలు కూడా సమర్పించాం. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.. ఇప్పుడైతే ఏకంగా బీర్లే అందుబాటులో ఉండవు అంటున్నారు. ఇలా అయితే పనికిమాలిన బీర్లను తాగాలి. లేకుంటే ఇతర ప్రాంతం వైపు వెళ్లిపోవాలని” కరీంనగర్ జిల్లా చెందిన ఓ మందుబాబు పేర్కొన్నాడు.. అయితే రేట్లు పెంచే విషయంలో ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 14 లక్షల కేసుల కింగ్ ఫిషర్ బీర్ల స్టాక్ మాత్రమే ఉంది. మరోవైపు ఈ వివాదాన్ని మరోరకంగా భారత రాష్ట్ర సమితి ప్రజెంట్ చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోకి బూమ్ బూమ్, బిర్యానీ బీర్ బ్రాండ్లను తీసుకువచ్చేందుకే కింగ్ ఫిషర్ కు ఎర్రజెండా చూపిస్తోందని భారత రాష్ట్ర సమితి నాయకులు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా యూబి గ్రూప్ విడుదల చేసిన లేఖను పోస్ట్ చేస్తూ.. పై విధంగా ఆరోపణలు చేస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్ నాయకులు కూడా దీనిపై స్పందిస్తున్నారు. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు యు బి గ్రూప్ కు బకాయిలు చెల్లించకపోవడంతోనే ఈ సమస్య నెలకొందని.. ఇప్పుడు ఈ నెపాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంపై నడుతున్నారని ఆరోపిస్తున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: United breweries has stopped supplying beer to telangana due to a price dispute
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com