TV5 Sambasiva Rao: మిగతావారు ఎలాంటి మాటలు మాట్లాడినా పెద్దగా లెక్కలోకి రాదు. కానీ మీడియాలో పనిచేసే ప్రతినిధులు స్పష్టంగా మాట్లాడాలి. విషయంపై సంపూర్ణ అవగాహన ఉండాలి. అప్పుడే మాట్లాడే మాటకు సార్ధకత ఉంటుంది. జనాలకు ఈజీగా అర్థమవుతుంది. కానీ ఈ విషయాన్ని టీవీ 5 లో పనిచేసే సీనియర్ జర్నలిస్టు సాంబశివరావు మర్చిపోయినట్టు కనిపిస్తోంది. దీంతో సోషల్ మీడియాలో ఆయన మీద ట్రోల్స్ ఎక్కువైపోయాయి.
Also Read: ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో మిస్ అయిన మహేష్ బాబు సినిమా అదేనా?
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ శాసనసభకు ఉప ఎన్నిక వచ్చింది. ఈ శాసనసభకు ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అని వార్యమైపోయింది. ఈ క్రమంలోనే అన్ని పార్టీలు అక్కడ పోటీలో ఉన్నాయి. హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. విజయం ఎవరిని వరుస్తుందో చెప్పలేని పరిస్థితి. ఎవరికివారు తామే విజయం సాధిస్తామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని న్యూస్ చానల్స్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రధానంగా దృష్టి సారించాయి. రకరకాలుగా కథనాలు ప్రచారం చేస్తున్నాయి.. అందులో టీవీ5 కూడా ఉంది. ఈ ఛానల్ లో ప్రైమ్ టైం లో సీనియర్ జర్నలిస్టు సాంబశివరావు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ ను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా నవీన్ యాదవ్ తండ్రి పేరును తప్పుగా పలికారు. మొదట్లో శ్రీనివాస్ యాదవ్ అని.. ఆ తర్వాత నాలుక కరుచుకుని చిన్న శ్రీశైలం యాదవ్ అని పేర్కొన్నారు. అంతేకాదు శ్రీశైలం యాదవ్ పట్టుబట్టి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తన స్కూలుకు కోటి రూపాయలు మంజూరు చేయించుకున్నారని పేర్కొన్నారు సాంబశివరావు. స్కూలును పాఠశాల అని.. ఓ సందర్భంలో స్కూలు అని సంబోధించి.. నవ్వుల పాలయ్యారు సాంబశివరావు.
వాస్తవానికి సాంబశివరావు సుప్రసిద్ధ జర్నలిస్ట్. విషయాన్ని విషయం మాదిరిగా చెప్పగలుగుతారు. ముక్కుసూటి తత్వాన్ని ప్రదర్శిస్తారు. అయితే అటువంటి సాంబశివరావు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి కి సంబంధించి పూర్తిస్థాయిలో సమాచారం లేకుండానే డిబేట్ నిర్వహించడం ఆశ్చర్యకరంగా ఉంది. పైగా లైవ్ లో ఆయన పదేపదే తప్పులు చెప్పడం.. వాటిని సవరించుకోవడానికి ప్రయత్నించడం.. నవ్వులు తెప్పిస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా కాలం నడుస్తోంది. దీనికి తోడు టీవీ5 రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉంటుందనే ప్రచారం ఎప్పటినుంచో ఉంది. ఈ నేపథ్యంలో సాంబశివరావు మాట్లాడిన మాటలను కొన్ని రాజకీయ పార్టీల నాయకులు ట్రోల్ చేస్తున్నారు. సాంబశివరావు చేసిన వ్యాఖ్యలకు మరో అర్ధాన్ని వ్యక్తి సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తున్నారు.
Telugu journalism has to be the worlds biggest circus show
pic.twitter.com/1dQOsMbZWI— Telangana Human (@humanityTelugu) October 24, 2025