TV5 Murthy Vs KA Paul: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమహేంద్రవరం సమీపంలో ఇటీవల పగడాల ప్రవీణ్ కుమార్ అనే పాస్టర్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. మొదట్లో ఈయన మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఆధారాలు లభించడంతో.. ప్రవీణ్ కుమార్ మరణం వెనక అసలు విషయాలు తెలిశాయి.
పాస్టర్ పడడాల ప్రవీణ్ కుమార్ మరణం పై క్రైస్తవ సంఘాలు రకరకలారోపణలు చేశాయి. ఓ వర్గం వారు ప్రవీణ్ కుమార్ ను కావాలని అంతమొందించారని.. ప్రవీణ్ కుమార్ మరణం పై విచారణ జరిపించాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. కొన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రవీణ్ కుమార్ మరణానికి ఇంకో భాష్యం చెప్పడం మొదలుపెట్టాయి. దీంతో ప్రవీణ్ కుమార్ మరణం మరో మలుపు తీసుకుంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో.. ప్రవీణ్ కుమార్ మరణం పై రకరకాల చర్చలు జరిగాయి. అయితే సిసి ఫుటేజీ వెలుగులోకి రావడం.. ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు ఫోటోలు తీయడంతో.. ప్రవీణ్ కుమార్ మరణ వెనుక అసలు విషయం తెలిసిపోయింది..
వాగ్యుద్ధం
ప్రవీణ్ కుమార్ మరణం.. జరిగిన మిగతా పరిణామాలపై టీవీ5 న్యూస్ ఛానల్ చర్చా వేదిక నిర్వహించింది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ప్రముఖ జర్నలిస్టు మూర్తి వ్యవహరించారు. ఈ డిబేట్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తో మూర్తి ఫోన్ లోనే చర్చ నిర్వహించారు. ప్రవీణ్ కుమార్ మరణానికి సంబంధించి వాస్తవాలు వెలుగులోకి వచ్చినప్పటికీ.. క్రైస్తవులు మొత్తం ఆందోళన చేయాలని.. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించాలని కేఏ పాల్ పిలుపునివ్వడంతో మూర్తి ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు.. ” మీ వీడియోలు నేను చాలా చూశా. మీరు సువార్తలు చెబుతుంటే విన్నా. అందువల్లే మీతో ఈ విషయాన్ని చర్చిస్తున్నా. అంతే తప్ప పని మనుషుల దగ్గర నుంచి కూడా దశమ భాగం అడిగే పాస్టర్లను ఇక్కడికి పిలవలేదు. ఒకవేళ పిలిస్తే కడిగిపారేసేవాన్ని.. జరిగిన విషయం తెలిసిన తర్వాత కూడా మీరు దేశం మొత్తం క్రైస్తవులను ఆందోళన చేయాలని ఎలా పిలుపునిస్తారు.. ఐజి గారు ఆ సీసీ ఫుటేజ్ విడుదల చేశారు. అందులో ప్రవీణ్ కుమార్ స్పష్టంగా కనిపిస్తున్నారు. మద్యం తాగారని.. ఆ మత్తులోనే అదుపుతప్పారని.. అందువల్లే వాహనం ధ్వంసం అయిందని పోలీసులు చెబుతున్నారు. అలాంటప్పుడు మీ సొంత భాష్యం చెప్పడం ఎందుకు.. క్రైస్తవులను రోడ్లమీదకి రావాలని పిలుపునివ్వడం దేనికి.. నాకు చంద్రబాబు సిసి ఫుటేజ్ ఇవ్వలేదు. ఐజి గారు సిసి ఫుటేజ్ మీడియా ప్రతినిధులందరికీ ఇచ్చారు. ఆ విషయం తెలియకుండా ఇష్టానుసారంగా ఎలా మాట్లాడుతారు. మీరు ప్రపంచంలో ప్రభావశీలమైన వ్యక్తులలో ఒకరు. మీ మీద నాకు ఆ గౌరవం ఉంది కాబట్టే మాట్లాడుతున్నాను. మీరు ఇదే చివరి ఇంటర్వ్యూ అంటే నాకు పెద్దగా ఇబ్బంది లేదు. నేను వాస్తవాలు మాత్రమే మాట్లాడతానని” పాల్ తో మూర్తి వ్యాఖ్యానించారు. సాధారణంగా కేఏ పాల్ పాత్రికేయుల మీద ఎదురు దాడికి దిగుతారు. కానీ తొలిసారిగా మూర్తి విపరీతమైన ఆగ్రహంతో మాట్లాడారు. కేఏ పాల్ పై పై చేయి సాధించారు.. మూర్తి మాట్లాడిన మాటలకు కేఏ పాల్ వద్ద సమాధానం లేకపోవడంతో సైలెంట్ అయిపోయారు. ఈ వీడియోను టిడిపి శ్రేణులు సోషల్ మీడియాలో తెగ హైలెట్ చేస్తున్నారు.
TV5 Murthy vs KA Paul #PastorParveen #PraveenPagadala
Vc : Tv5 news pic.twitter.com/DJU5B0kgo1
— Narendra News (@Narendra4News) March 31, 2025