Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నాని ( Kodali Nani) ప్రస్తుతం ముంబాయిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొద్ది రోజుల కిందట ఆయన అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాదులోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయనకు గుండె సంబంధిత వ్యాధులతో పాటు కిడ్నీకి సంబంధించిన వ్యాధులు చుట్టుముట్టడంతో పరిస్థితి క్రిటికల్ గా మారింది. ఈ తరుణంలో ప్రత్యేక విమానంలో హుటాహుటిన ముంబై తరలించారు. అక్కడ ఏషియన్ హాట్ ఇన్స్టిట్యూట్ డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఆస్పత్రిలో ఫేమస్ డాక్టర్ రమాకాంత్ పాండా కొడాలి నాని కి బైపాస్ సర్జరీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డాక్టర్ రమాకాంత్ పాండా గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయన గతంలో పలువురు ప్రముఖులను సర్జరీలు చేసిన అనుభవం ఉంది. క్లిష్టమైన సర్జరీలను సైతం విజయవంతంగా పూర్తి చేశారని గుర్తింపు ఉంది. అందుకే కొడాలి నానిని అక్కడికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా చొరవ తీసుకున్నట్లు సమాచారం.
Also Read : కరువుపై ఏపీ ప్రభుత్వం ప్రకటన!
* ఆ ఆసుపత్రి చైర్మన్ గా..
ముంబైలోని ఏసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ కు చైర్మన్గా డాక్టర్ రమాకాంత్ పాండా( Ramakant Paanda) ఉన్నారు. గుండె సంబంధిత సర్జరీలు చేయడంలో చాలా అనుభవం ఉంది పాండాకు. జాతీయస్థాయిలో సైతం మంచి పేరు ఉంది. గతంలో 2009లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు డాక్టర్ పాండా సర్జరీ చేశారు. అత్యంత సంక్లిష్టమైన కార్డియాక్ సర్జరీలను సైతం సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తారని పాండాకు మంచి పేరు ఉంది. ఆయనే కొడాలి నాని ఫిక్స్ అయితం వైద్యం చేస్తారని తెలుస్తోంది. మన రాష్ట్రానికి చెందిన కొనకళ్ళ నారాయణకు సైతం పాండా అప్పట్లో శస్త్ర చికిత్స చేశారు.
* గత వారం రోజులుగా..
ప్రస్తుతం కొడాలి నాని ముంబై ఆసుపత్రిలోనే( Mumbai hospital) చికిత్స పొందుతున్నారు. తొలుత మార్చి 26న ఆయన అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతూ హైదరాబాదులోని ఏఐజి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అక్కడ వైద్య పరీక్షలు చేయగా ఆయనకు గుండె సంబంధిత సమస్య ఉన్నట్లు గుర్తించారు. గుండెకు రక్తం సరఫరా చేసే మూడు రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయని డాక్టర్లు గుర్తించారు. ఈ క్రమంలోనే స్టంట్స్ వేస్తారని తొలుతా భావించారు. అయితే ఆయన ఆరోగ్యం సహకరించడం లేదు. ఒకవేళ సర్జరీ చేస్తే ఇబ్బంది పడతామని భావించారట హైదరాబాదులోని వైద్యులు. ఈ విషయంలో చక్కటి అనుభవమున్న ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అయితే సరిపోతుందని అంతా భావించారట. ఈ విషయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు సమాచారం.
* గత అనుభవాల దృష్ట్యా..
గతంలో జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ మంత్రిగా ఉన్న సమయంలో పినిపే విశ్వరూప్( Vishwaroop) కూడా గుండెపోటుకు గురయ్యారు. 2022 సెప్టెంబర్లో ఆయన గుండె నొప్పితో హైదరాబాదుకు తరలించారు. అయితే అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ముంబైలోనే ఏసియన్ హార్ట్ సెంటర్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు గుండెలో ఆరు చోట్ల రక్తనాళాలు బ్లాక్ కావడంతో డాక్టర్లు ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. అప్పట్లో ఆయనకు సైతం సర్జరీ చేసింది డాక్టర్ రమాకాంత్ పాండా. అప్పటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి సైతం ముంబై తరలించాలని సూచించినట్లు సమాచారం.
Also Read : ఏపీలో రహదారులకు రూ.2000 కోట్లు.. కూటమి ప్రభుత్వం సంచలనం