TV5 Murthy And Racha Ravi Video: ప్రధాన మీడియాలో పనిచేసేవారు సోషల్ మీడియాలో విపరీతంగా యాక్టివ్ గా ఉంటున్నారు. తమకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటున్నారు. ఇది ఇక్కడితోనే ఆగిపోవడం లేదు.. రీల్స్ చేస్తున్నారు. సరదాగా వీడియోలు రూపొందించి పోస్ట్ చేస్తున్నారు.. తద్వారా తమ రీచ్ మరింత పెంచుకుంటున్నారు. ఇలాంటి వాటి ద్వారా తమ తలనొప్పిని కూడా తగ్గించుకుంటున్నారు. వృత్తి గత జీవితంలో ఒత్తిడిని ఈ విధంగా దూరం చేసుకుంటున్నారు.
Also Read: కేటీఆర్ కోసం సీఐ.. ఇక గులాబీ కండువా కప్పుకోవడమే మిగిలింది..
తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో మూర్తికి ప్రత్యేక స్థానం ఉంటుంది.ఓ చానల్లో తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన మూర్తి టీవీ 5 దాకాసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం టీవీ5 ఛానల్ సీఈఓ గా కొనసాగుతున్నారు. ఇటీవల పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలు మొదలుపెట్టారు.. ముందుగా చంద్రబాబు నాయుడుని.. ఆ తర్వాత కల్వకుంట్ల కవితని మూర్తి ఇంటర్వ్యూ చేశారు. విభిన్నమైన ప్రశ్నలు అడిగి.. వారి దగ్గర నుంచి సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు మూర్తి. మొత్తంగా ఈ ఇంటర్వ్యూలు సూపర్ క్లిక్ అయ్యాయి. రొటీన్ గా కాకుండా.. చాలా విభిన్నంగా ఉన్నాయి.. ఈ ఇంటర్వ్యూలు కొన్ని పార్టీలకు బలంగాను.. మరికొన్ని పార్టీలకు సమాధానం చెప్పుకోలేని ప్రశ్నలుగానూ మిగిలిపోయాయి.
మూర్తి పాత్రికేయుడు మాత్రమే కాదు. అప్పుడప్పుడు రీల్స్ చేస్తుంటారు. సరదాగా వీడియోలు కూడా రూపొందిస్తుంటారు. వాటిని తన సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్ట్ చేస్తుంటారు. అయితే మూర్తి రూపొందించిన ఒక రీల్ ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో చర్చకు దారి తీస్తోంది. ఆయన ప్రముఖ సినీ నటుడు రచ్చ రవితో కలిసి ఒక చిన్న వీడియోలో కనిపించారు. ఆ వీడియోలో మూర్తి తన కారును ఒక సర్వీస్ సెంటర్ కు తీసుకెళ్తాడు. ఈ లోగానే అక్కడ రచ్చ రవి కనిపిస్తాడు. “రవి కారులో ఫ్యూయల్ అయిపోయింది. పోయి అంటాడు. దానికి రవి ఇంజన్ ఫ్యూయల్ కాకుండా సీసాలో ఉన్న మద్యాన్ని పోస్తాడు. మద్యాన్ని పోసిన తర్వాత ఆ కారు అటూ ఇటూ ఎగురుతూ ఉంటుంది. దీంతో మూర్తి ఒక్కసారి ఆశ్చర్యపోతాడు. మందు మనుషులకే కాదు.. చివరికి వాహనాలను కూడా షేక్ చేస్తుందని ఈ వీడియో ద్వారా మూర్తి చెప్పాడు. అయితే ఈ వీడియో ఫన్నీగా ఉన్నప్పటికీ రకరకాల ఆలోచనలను తెరపైకి తెస్తోంది. మరోవైపు మూర్తికి తాగే అలవాటు లేదు.. ఇటీవల అతడు మాంసాహారం కూడా పూర్తిగా మానేశాడు. పూర్తి శాఖాహారిగా మారిపోయాడు. తను ఏం తింటాడో.. ఏం తాగుతాడో కూడా అప్పుడప్పుడు వీడియోలు పెడుతుంటాడు. రవి, మూర్తి కనిపించిన ఈ వీడియో ఆకట్టుకుంటున్నది.. తాగడం వల్ల మనుషులు మాత్రమే కాదు చివరికి వాహనాలు కూడా పాడవుతున్నాయనే అంతర్గత సందేశాన్ని ఈ వీడియో ద్వారా మూర్తి ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నాన్ని మెచ్చుకోక తప్పదు.