Jabardasth Varsha: జబర్దస్త్ ఫేమ్ వర్ష గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ షో ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించింది. తక్కువ సమయంలోనే ఫేమ్ రాబట్టింది. ముఖ్యంగా ఇమ్మానుయేల్ తో లవ్ ట్రాక్ నడిపి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అతనితో క్లోజ్ గా ఉంటూ నిజమైన ప్రేమ లాగే కలరింగ్ ఇచ్చింది. ప్రేమ గురించి అడిగినప్పుడల్లా ఎమోషనల్ డ్రామా చేస్తూ ఇమ్ముని ప్రాణంగా ప్రేమిస్తున్నట్లు వర్ష చెప్పేది.
ఇదంతా చూసిన ఆడియన్స్ వాళ్ళు నిజమైన ప్రేమకులని నమ్మేవారు. వాళ్ళు పెళ్లి కూడా చేసుకుంటారని రూమర్స్ వచ్చాయి. అంతలా ఇమ్ము – వర్ష కెమిస్ట్రీ కురిపించారు. అయితే వాళ్ళు ఇందంతా కేవలం టిఆర్పీ కోసం చేశారు. వాళ్ళది నిజమైన ప్రేమ కాదని స్పష్టం అయింది. ఈ నేపథ్యంలో వర్ష – ఇమ్మాన్యుయేల్ ని ప్రేమించడం లేదని తేలిపోయింది. కాగా వర్ష ప్రస్తుతం ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు ఆమె ఇమ్మానియేల్ సీక్రెట్ లీక్ చేశాడు.
ఇండైరెక్ట్ గా వర్ష లవర్ గురించి హింట్ ఇచ్చాడు. ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో విడుదలైంది. ఇందులో ఇమ్మాన్యుయేల్ – వర్ష ‘ ప్రేయసి రావే’ సినిమా స్పూఫ్ చేశారు. ఈ క్రమంలో ఇమ్ము నీకు ప్రేమ మీద ఒపీనియన్ ఏంటి అని అడుగుతాడు. మనల్ని చాలా మంది ప్రేమిస్తారు .. కానీ మనం మాత్రం ఒకరినే ప్రేమిస్తాం అని వర్ష చెప్తుంది. దీంతో ‘ ఆ ఒక్కరు ఎవరో చెప్పొచ్చుగా .. సెట్ మొత్తం వెయిటింగ్ అని ఆమె నిజంగానే ప్రేమలో ఉందని హింట్ ఇచ్చాడు.
తర్వాత ఇమ్మాన్యుయేల్ ‘ మీకు కావాల్సిన వాడు ఎలా ఉండాలో చెబితే అని అంటాడు. దీంతో వర్ష వాడు ఆరడుగులు ఉండాలి, సిక్స్ ప్యాక్ బాడీ ఉండాలి అని అంటుంది. అప్పుడు ఇమ్ము ‘ మాకు తెలిసినోడికి ఇవన్నీ లేవుగా అంటూ అసలు మేటర్ చెప్పేశాడు. దీంతో వర్ష ఇమ్ము వెంటపడి మరీ కొట్టింది. ఇక వర్ష పలు సీరియల్స్ కూడా నటించిన సంగతి తెలిసిందే. అభిషేకం, ప్రేమ ఎంత మధురం, తూర్పు పడమర సీరియల్స్ లో మెప్పించింది. ప్రస్తుతం జబర్దస్త్, శ్రీ దేవి డ్రామా కంపెనీ షోలు చేస్తుంది.