Traffic fine record Telangana: ద్విచక్ర వాహనాలు, ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాలు అంతకుమించిన వాహనాలు నడిపేవారు కచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. ఎందుకంటే ఈ వాహనాలకు వేగంగా వెళ్లే సామర్థ్యం ఉంటుంది. మితిమీరిన వేగంతో ప్రయాణిస్తే ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది. అందువల్లే ఈ వాహనాలు నడిపేవారు కచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని.. ట్రాఫిక్ పోలీసులు చెబుతుంటారు. నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తారు. ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి హెచ్చరికలు చేసినప్పటికీ.. కొంతమంది వాహనదారులు మారడం లేదు. తమ తీరు మార్చుకోవడం లేదు. ట్రాఫిక్ నిబంధనలను ఏమాత్రం పాటించడం లేదు. పైగా అతిక్రమిస్తున్నారు. తమను ఎవరు ఏం చేయలేరనే ధీమతో వారు ఉంటున్నారు. పైగా ట్రాఫిక్ పోలీసుల కళ్ళు కప్పి వారు ప్రయాణిస్తున్నారు. అలాంటి ఒక ఘనుడు పోలీసులకు దొరికాడు. అతని వాహనంపై ఉన్న ట్రాఫిక్ చలాన్లను చూసి పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది.
Also Read: Telangana DGP Anjani Kumar: బజ్జీల కోసం అంబులెన్స్ నే వాడుకున్నాడు.. ఈ డ్రైవర్ చేసి పని దారుణం
తెలంగాణలోని కాజీపేట చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు శనివారం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ వాహన తనిఖీలలో అస్లాం అనే వ్యక్తి బైక్ ను పోలీసులు చెక్ చేశారు. అతడి బైక్ మీద ఏకంగా 233 ట్రాఫిక్ చలాన్లు పెండింగ్లో ఉండడం విశేషం. ఈ పెండింగ్ లో ఉన్న చలాన్ల విలువ మొత్తం 43,530. దీంతో ఆ మొత్తాన్ని చెల్లించే వరకు వాహనాన్ని తమ ఆధీనంలో ఉంచుకుంటామని ట్రాఫిక్ సిఐ వెల్లడించారు..” అస్లాం ఉపయోగించే బైక్ మీద ఏకంగా 233 ట్రాఫిక్ చలాన్లు ఉన్నాయి. వాటిని చెల్లించకుండా అతడు ఇష్ట రాజ్యాంగా వ్యవహరిస్తున్నాడు. అనేక సందర్భాల్లో పోలీసుల కళ్ళు కప్పి అతడు ప్రయాణించాడు. అయితే ఈసారి తనిఖీలో అతడు దొరికిపోయాడు. అతడు ప్రయాణిస్తున్న బైక్ ను పరిశీలించి చూస్తే మొత్తంగా 233 ట్రాఫిక్ చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. వాటి విలువ 45,350 దాకా ఉంది. అతడు ఆ మొత్తం చెల్లించే దాకా బైక్ ను మా ఆధీనంలో ఉంచుకుంటామని” ట్రాఫిక్ సిఐ వెల్లడించారు.. దీంతో అస్లాం ఆ నగదు మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.
Also Read: Traffic Challan : అంత్యక్రియల ఊరేగింపు తీసుకెళ్తున్న కారుకు చలాన్ వేస్తారా.. ?
చాలామంది ఇలానే ఉన్నారు
ట్రాఫిక్ పెండింగ్ చలాన్లు ఉన్న వారు తెలంగాణలో చాలా మంది ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. కాకపోతే వారు దొడ్డిదారుల్లో ప్రయాణిస్తున్నారని.. తమకు చిక్కకుండా వెళ్లిపోతున్నారని ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు.. ఇటువంటి వారి కోసమే ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహిస్తున్నామని.. వారి వద్ద నుంచి పెండింగ్ చలానాలు వసూలు చేస్తున్నామని పోలీసులు వివరిస్తున్నారు. డబ్బులు చెల్లించని పక్షంలో వారి వాహనాలను తమ వద్ద ఉంచుకుంటున్నామని పోలీసులు పేర్కొంటున్నారు.