కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారత్ బంద్ లో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉప్పల్ బస్ డిపోవద్ద బంద్ లో పాల్గొన్నారు. అక్కడికి భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు తరలి రావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో కార్యకర్తలకు పోలీసులకు వాగ్వాదం ఏర్పాడింది. దీంతో రేవంత్ రెడ్డిని మరియు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి ఉప్పల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
భారత్ బంద్ లో భాగంగా ఉప్పల్ బస్ డిపో వద్ద బంద్ లో పాల్గొన్న రేవంత్ రెడ్డిదేశంలోని రైతు సంఘాల ప్రకటించిన భారత్ బంద్ కు అఖిల పక్షాల మద్దతులో భాగంగా వనస్థలిపురంలో ధర్నాలో పాల్గొన్న టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ గారిని అరెస్ట్ చేసి వనస్థలిపురం పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. రాంగోపాల్ పెట్ పీఎస్ లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ,టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు,సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలోని రైతు సంఘాల ప్రకటించిన భారత్ బంద్ కు అఖిల పక్షాల మద్దతులో భాగంగా వనస్థలిపురంలో ధర్నాలో పాల్గొన్న టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ గారిని అరెస్ట్ చేసి వనస్థలిపురం పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.