Tollywood Singer Birthday party: టాలీవుడ్ లో ప్రముఖ సింగర్ గా పేరొందిన ఆమె ఈ వివాదంలో చిక్కుకోవడంతో ఒక్కసారిగా కలకలం నెలకొంది. పోలీసులు, ఎస్ వో టీ బృందాలు సంయుక్తంగా దాడి చేయడంతో అక్కడ జరుగుతున్న వ్యవహారం బయటపడింది. విదేశీ మద్యం సీసాలు, హుక్కా తాగడానికి వినియోగించే ప్రత్యేకమైన యంత్రాలు, మాదకద్రవ్యాలు స్వీకరించినట్టు ఆనవాళ్లు పోలీసులకు కనిపించాయి.
పోలీసులు ఒక్కసారిగా దాడి చేయడంతో వేడుకకు హాజరైన వారు హతాశులయ్యారు. పోలీసులు మూకుమ్మడిగా దాడులు చేయడం.. ఆ తర్వాత అక్కడ విదేశీ మద్యం సీసాలను.. ఇతర ఆధారాలను సేకరించడం.. అక్కడ దృశ్యాలను మొత్తం వీడియో తీయడం.. వాటిని బయటికి విడుదల చేయడంతో సంచలనం నెలకొంది.. పోలీసులు దాడి చేస్తున్న నేపథ్యంలో ఆ సింగర్ కూడా అక్కడే ఉంది. పోలీసులు అక్కడదృశ్యాలను వీడియో తీస్తుంటే ఆ స్టార్ సింగర్ ఆపండి అంటూ.. పోలీసులకు విజ్ఞప్తి చేస్తే వారు పట్టించుకోలేదు. పైగా మా డ్యూటీ మమ్మల్ని చేసుకోనివ్వండి అంటూ గట్టిగా ఆమెతో వాగ్వాదానికి దిగారు.
ఇంతకీ ఏం జరిగింది..
స్టార్ సింగర్ పుట్టినరోజు వేడుకకు భారీగా సెలబ్రిటీలు వచ్చారు. అందులో ఫేమస్ లిరిక్ రైటర్, ఓ అగ్ర నటుడి సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన వర్ధమాన నటి.. ఇతర సెలబ్రిటీలు.. కొంతమంది యూట్యూబర్లు కూడా పుట్టినరోజు వేడుకకు హాజరయ్యారని తెలుస్తోంది. స్టార్ సింగర్ కు, లిరిక్ రైటర్ గతంలో అనేక పాటలు రాశారని.. అతడు రాసిన పాటలు సూపర్ హిట్ అయ్యాయని తెలుస్తోంది. ఓవర్ నైట్ స్టార్ డం రావడంతో.. ఆమె ఇటీవల పబ్, క్లబ్ లలో కూడా పాటలు పాడుతున్నారని తెలుస్తోంది. మరోవైపు ఇటీవల ఓ దేవాలయంలో ఆమె ప్రైవేట్ సాంగ్ షూటింగ్ వివాదానికి కారణమైంది. దానిపై ఆమె వివరణ ఇచ్చినప్పటికీ ఉపయోగలేకుండా పోయింది.
View this post on Instagram
గతంలో అధికారంలో ఉన్న పార్టీకి ఆమె పాటలు పాడారని.. ఇందులో భాగంగానే ఆమెకు ఒక కీలక పోస్టు లభించింది అని తెలుస్తోంది. అయితే ఇప్పుడు అనుకోకుండా తన పుట్టినరోజు వేడుక వివాదం కావడం.. అందులో విదేశీ మద్యం, మాదక ద్రవ్యాలు కనిపించడంతో ఆమె కెరియర్ మొత్తం తిరోగమనంలో పడిపోయినట్టేనని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి దీనిపై ఆ స్టార్ సింగర్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ కేసులో పోలీసులు బలమైన ఆధారాలు స్వీకరించిన నేపథ్యంలో వ్యవహారం మరింత సీరియస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు ఆ పార్టీలో పాల్గొన్న వారందరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ సాగిస్తున్నారు.