https://oktelugu.com/

బిగ్ బాస్ : పెద్ద తప్పు చేసిన అభిజీత్.. మంచి ఛాన్స్ మిస్ !

బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 చివరి దశకు చేరుకోవడంతో ఇంటి సభ్యుల మధ్య అసలైన ఆట ఇప్పటినుండే మొదలు అయ్యేలా కనిపిస్తోంది. ఈ షో వల్ల ఎంతో మంది సెలెబ్రిటీలు చెడ్డ పేరును మూటగట్టుకోగా, చాలా మంది చిన్నాచితకా ఆర్టిస్టులు ఫుల్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ప్రస్తుత సీజన్ లో కంటెస్టెంట్ అభిజీత్ తన ఆట తీరుతో అలాగే తన లవ్ ట్రాకులతో మొత్తానికి ఫుల్ గా పాపులర్ అయిపోయాడు. అయితే తాజాగా షోలో […]

Written By:
  • admin
  • , Updated On : December 12, 2020 / 11:33 AM IST
    Follow us on


    బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 చివరి దశకు చేరుకోవడంతో ఇంటి సభ్యుల మధ్య అసలైన ఆట ఇప్పటినుండే మొదలు అయ్యేలా కనిపిస్తోంది. ఈ షో వల్ల ఎంతో మంది సెలెబ్రిటీలు చెడ్డ పేరును మూటగట్టుకోగా, చాలా మంది చిన్నాచితకా ఆర్టిస్టులు ఫుల్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ప్రస్తుత సీజన్ లో కంటెస్టెంట్ అభిజీత్ తన ఆట తీరుతో అలాగే తన లవ్ ట్రాకులతో మొత్తానికి ఫుల్ గా పాపులర్ అయిపోయాడు. అయితే తాజాగా షోలో అభిజీత్ పెద్ద తప్పు చేయడంతో.. అతను మంచి ఛాన్స్ కోల్పోయాడు..ఫినాలే వీక్‌కు ముందు అఖిల్‌ను మినహా అందరినీ నామినేట్ చేసిన బిగ్ బాస్.. కొన్ని టాస్కులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

    Also Read: అప్పటి సీక్రెట్స్ : సిల్క్ స్మితతో ప్రొడక్షన్ బాయ్స్ నుండి సూపర్ స్టార్స్ వరకూ.. !

    అయితే ఆ టాస్క్ ల్లో గెలిచిన వారు నేరుగా ప్రేక్షకుల నుంచి ఓట్లు అభ్యర్ధించవచ్చు. ఇక ఇప్పటికే మూడు టాస్కులు పూర్తవగా, వాటిలో ఆరియానా రెండు సార్లు, సోహెల్ ఒకసారి గెలుపొందారు. కాగా తాజాగా జరిగిన మరో టాస్కులో అభిజీత్ పెద్ద తప్పు చేసి మంచి ఛాన్స్ పోగొట్టుకున్నాడు. నిజానికి ఎప్పుడు టాస్క్ వచ్చినా.. ఆ లెటర్‌ను పదే పదే చదువుతూ అందరికీ గుర్తు చేసే అభిజీత్.. తాజాగా ఇచ్చిన వినోదం టాస్కులో మాత్రం తానే రూల్స్ బ్రేక్ చేసి పొరపాటు చేశాడు. డ్యాన్స్ చేస్తూనే ఉండాలి అని, సాంగ్ గ్యాప్‌లో స్టేజ్‌పై కూర్చోకూడదని బిగ్ బాస్ చెప్పినా.. అభిజీత్ కూర్చున్నాడు.

    Also Read: ఎన్నో సమస్యలు.. ఎట్టకేలకు ఇప్పటికీ రిలీజ్ ఫిక్స్ !

    అది గమనించిన మోనాల్ గుర్తు చేయగా, జడ్జ్ అఖిల్, అభిజీత్ ను టాస్క్ నుంచి తప్పించాడు. దాంతో అభిజీత్ ఓట్లు అడిగే ఛాన్స్ మిస్ అయిపోయాడు. ఏది ఏమైనా అభిజీత్ హీరోగా కొన్ని సినిమాల్లో నటించినా.. పెద్దగా గుర్తింపు మాత్రం దక్కించుకోలేకపోయాడు. కానీ, బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. అభిజీత్ కి ఫ్యాన్స్ కూడా పుట్టుకొచ్చారు అంటే.. అర్ధం చేసుకోవచ్చు మనోడు ఏ రేంజ్ లో స్సక్సెస్ అయ్యాడో. మొదటి ఎపిసోడ్ నుంచే మోనాల్‌తో, ఆ తర్వాత దేత్తడి హారికతో ట్రాక్ నడపడం కూడా అభిజీత్ కి బాగా ఉపయోగపడింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్