https://oktelugu.com/

బీజేపీ బండి సంజయ్ ముందున్న సవాళ్లు ఇవే..

బండి సంజయ్‌.. తెలంగాణ రాష్ట్రంలో పెద్దగా పరిచయం అక్కర్లేని రాజకీయ నేత అని చెప్పాలి. ఆర్‌‌ఎస్‌ఎస్‌ నుంచి ప్రస్థానం ప్రారంభించి తర్వాత ఏబీవీపీలో పనిచేసి అంచెలంచెలుగా ఎదిగారు. నేషనల్‌ పార్టీ అయిన బీజేపీలో సామాన్య కార్యకర్తగా పనిచేసిన ఆయన.. ఇప్పుడు ఆ పార్టీ స్టేట్‌ చీఫ్‌ అయ్యారు. అతని సిన్సియారిటీ.. అతని తెగువ.. అతని పోరాట పటిమను చూసే అధిష్టానం ఈ పదవి కట్టబెట్టిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. హిందుత్వమే ఊపిరిలా పోరాడే సంజయ్‌ ఇప్పుడు కరీంనగర్‌‌ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 12, 2020 / 10:29 AM IST

    bandi sanjay

    Follow us on

    బండి సంజయ్‌.. తెలంగాణ రాష్ట్రంలో పెద్దగా పరిచయం అక్కర్లేని రాజకీయ నేత అని చెప్పాలి. ఆర్‌‌ఎస్‌ఎస్‌ నుంచి ప్రస్థానం ప్రారంభించి తర్వాత ఏబీవీపీలో పనిచేసి అంచెలంచెలుగా ఎదిగారు. నేషనల్‌ పార్టీ అయిన బీజేపీలో సామాన్య కార్యకర్తగా పనిచేసిన ఆయన.. ఇప్పుడు ఆ పార్టీ స్టేట్‌ చీఫ్‌ అయ్యారు. అతని సిన్సియారిటీ.. అతని తెగువ.. అతని పోరాట పటిమను చూసే అధిష్టానం ఈ పదవి కట్టబెట్టిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. హిందుత్వమే ఊపిరిలా పోరాడే సంజయ్‌ ఇప్పుడు కరీంనగర్‌‌ ఎంపీ కూడా.

    Also Read: టీ.కాంగ్రెస్ ఇన్ చార్జిగా యువనేత.. రేవంత్ కు లైన్ క్లియరా?

    2020 మార్చిలో సంజయ్‌ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికై బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు కరోనాతో తన బలం చూపించని సంజయ్‌కి ఇప్పుడు మున్ముందు మరిన్ని చాలెంజ్‌లు ఎదురుకాబోతున్నాయి. సామాన్య కార్యకర్త నుంచి వచ్చిన ఆయనకు రాష్ట్ర నాయకత్వాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు..? రానున్న చాలెంజ్‌లను ఎలా స్వీకరిస్తారు..? పార్టీ మరింత బలోపేతానికి ఎలాంటి వ్యూహం రచిస్తున్నారు..? అధికార టీఆర్‌‌ఎస్‌ పార్టీని తట్టుకొని ఏమేరకు నిలబడతారు..? మున్ముందు రానున్న ఎన్నికలను ఎలా  ఎదుర్కోబోతున్నాడు..? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో నడుస్తున్న టాక్‌ ఇదే.

    ఇటీవల చూస్తే సంజయ్‌ స్పీడ్‌ పెంచినట్లుగా అర్థమవుతోంది. కరోనా క్రైసిస్‌ నడుస్తున్నా అన్ని జిల్లాలనూ చుట్టేస్తున్నారు. తాజాగా తెలంగాణ విమోచన దినం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ యాత్ర చేపట్టారు. జిల్లాల నేతలు కూడా ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలిచారు. ఇప్పటిదాక కరోనా సంక్షోభం సమయంలో తన పోరాట పటిమను చాటే ఛాన్స్‌ రాలేదు సంజయ్‌కి.

    ఇప్పుడు వరుస ఎన్నికలు సంజయ్‌కి చాలెంజ్‌ విసరబోతున్నాయి. ఒకటి అసెంబ్లీ ఉప ఎన్నిక, మరోటి ఎమ్మెల్సీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు మరికొద్ది రోజుల్లోనే రానున్నాయి. బీజేపీకి ఏపాటి బలం ఉందో.. క్షేత్ర స్థాయిలో ఎంతటి పట్టు ఉందో, ప్రజల మనసులో ఎంతటి ఆదరణ ఉందో ఈ ఎన్నికల ద్వారా తెలియనుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికే నిర్దేశించారు. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ, వరంగల్, నల్గొండ, ఖమ్మం శాసనమండలి స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచేలా తగిన వ్యూహ రచనతో తమ అడుగులు ముందుకు సాగాలన్నారు.

    ఎమ్మెల్సీ, కార్పొరేషన్ల ఎన్నికలకు కొంత టైం ఉన్నా.. ముందుగా దుబ్బాక ఉప ఎన్నిక దూసుకొస్తోంది. ఇక్కడ పోటీకి టీఆర్‌‌ఎస్‌కు పోటీగా బీజేపీ కాలుదువ్వుతోంది. తెలంగాణలో టీఆర్ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయమని, ప్రజల మన్ననలు పొందిన పార్టీ అని కమలనాథులు చెబుతున్నారు. ఇక దుబ్బాకలో ఏ స్థాయిలో సత్తా చాటుతారో వేచి చూడాలి. బండి సంజయ్ ఎన్నికల వ్యూహానికి ఇది తొలి పరీక్ష. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల తరువాత జరిగిన స్థానిక సమరంలోపార్టీ అనుకున్నంత స్థాయిలో ప్రభావం చూపలేకపోయినా అప్పటికి సంజయ్ సారథిగా లేరు.

    Also Read: తెలుగు మీడియా హౌజ్‌లోకి మరో చానల్‌

    ప్రస్తుత పరిస్థితి మెరుగ్గా ఉందనుకుంటున్నా సంజయ్‌కి ఇప్పుడు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దుబ్బాక ఉప ఎన్నిక తరువాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు బీజేపీకి సెమీ ఫైనల్ లాంటివని చెప్పొచ్చు. మరి బండి సంజయ్ కెప్టెన్సీలో పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందా లేదా చూడాల్సి ఉంది. 150 డివిజన్లు ఉన్న జీహెచ్‌ఎంసీలో బీజేపీకి ఐదుగురు కార్పొరేటర్లు కూడా లేరు. పైగా పార్టీ ముఖ్య నేతలంతా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. జీహెచ్‌ఎంసీతోపాటే గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు కూడా రెడీ కావాల్సి ఉంది. ఈ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్‌కు దీటుగా నిలపాలంటే గెలిచి తీరాలి మరి. మార్చిలో పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి. వీటన్నింటినీ చూస్తుంటే.. రానున్న కాలంలో బీజేపీ కొత్త సారథి సంజయ్‌ ఎన్నో పరీక్షలను ఎదుర్కోబోతున్నట్లే..!