సుశాంత్ కేసులో డ్రగ్స్ ప్రమేయం బయటపడడం.. అతడి ప్రియురాలు రియా చక్రవర్తిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు అటు తిరిగి ఇటు తిరిగి టాలీవుడ్ టాప్ హీరోయిన్ మెడకు చుట్టుకున్నట్టే కనిపిస్తోందని మీడియా వార్తలను బట్టి తెలుస్తోంది.
Also Read: వాళ్ల సాయంపై పవన్ కళ్యాణ్ ఎమోషనల్?
తాజాగా డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తిని ముంబై ఎన్.సీ.బీ అదికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన రియా డ్రగ్స్ తీసుకునే పలువురు బాలీవుడ్ నటుల పేర్లను వెల్లడించినట్టు సమాచారం. వారిలో తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా ఉన్నట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఇక రియా వెల్లడించిన జాబితాలో బాలీవుడ్ హీరోలు సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్, హీరో రణ్ వీర్ సింగ్ సన్నిహితురాలు సైమోన్ ఖంబట్టా తదితరుల పేర్లు ఉన్నట్టు టైమ్స్ నౌ ఒక సంచలన వార్త కథనాన్ని ప్రసారం చేసింది.
Also Read: గుండు వెనుక అసలు కారణం ఇదా….?
దీంతో ఈ డ్రగ్స్ దందా టాలీవుడ్ కు కూడా పాకినట్టైంది. మొత్తం 20 మంది బాలీవుడ్ తారల పేర్లు రియా వెల్లడించినట్టుగా సమాచారం అందుతోంది. దీంతో వారంతా చిక్కుల్లో పడినట్టే కనిపిస్తోంది.