https://oktelugu.com/

Siddipet: 26 ఏళ్ల క్రితం వరకు కావ్య శ్రీ.. ఇప్పుడేమో కార్తికేయ.. ఆమె నుంచి అతడుగా మారిన.. ఇతని జీవితం ఎలాంటి మలుపులు తీసుకుందంటే..

జంబలకడిపంబ సినిమా చూశారా.. అందులో మగవాళ్లు ఉన్నట్టుండి ఆడవాళ్లుగా మారిపోతారు. ఆడవాళ్లు మగవాళ్ళుగా రూపాంతరం చెందుతారు. అదంటే సినిమా కాబట్టి.. కాస్త లిబర్టీస్ ఉంటాయి. మరి అలాంటిది నిజ జీవితంలో జరిగితే.. జరగడం ఏంటి.. జరిగితీరింది..

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 17, 2024 / 07:45 AM IST

    Siddipet

    Follow us on

    Siddipet: అది సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట. ఈ గ్రామంలో దొంతగాని రమేష్, మంజుల అనే దంపతులు జీవిస్తున్నారు. వీరికి 1996 అక్టోబర్ 30న కావ్య శ్రీ అనే అమ్మాయి జన్మించింది. అయితే 2018 నుంచి కావ్య శ్రీ శరీరంలో విపరీతమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఉన్నట్టుండి మీసాలు వచ్చాయి. గడ్డం పెరిగింది. దీనికి తోడు విపరీతమైన కడుపునొప్పి.. అంతర్గతంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో రమేష్, మంజుల కావ్య శ్రీ ని హైదరాబాద్ తీసుకెళ్లారు. అక్కడ ఎన్ని రకాల పరీక్షలు చేసినప్పటికీ వారికి సమస్య అర్థం కాలేదు. దీంతో అక్కడి వైద్యులు కావ్య శ్రీ ని ఇతర ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్తే.. మంజుల, రమేష్ బెంగళూరు వెళ్లారు. అక్కడి వైద్యులు అనేక రకాల పరీక్షలు నిర్వహించి.. కావ్య శ్రీ యువతి కాదని.. ఆమె పురుషుడని.. ఆమె శరీరంలో పురుష లక్షణాలు ఉన్నాయని.. పురుషులకు ఉన్నట్టు వృషణాలు ముడుచుకొని ఉన్నాయని.. 2.5 అంగుళాల అంగం కూడా ఉందని స్పష్టం చేశారు. అంతేకాదు శస్త్ర చికిత్స ద్వారా ముడుచుకొని ఉన్న ఆ వృషణాలను బయటకు తీస్తామని.. అధికంగా ఉన్న కొవ్వు వల్ల చాతి భాగం ఎత్తుగా కనబడిందని పేర్కొన్నారు.

    26 సంవత్సరాల వయసులో..

    కావ్య శ్రీ ని మొదట రమేష్, మంజుల ఆడపిల్లగానే భావించారు. ఆమెను అల్లారుముద్దుగా పెంచుకున్నారు. క్రమక్రమంగా కావ్య శ్రీ శరీరంలో మార్పులు చోటుచేసుకున్నాయి. 26 సంవత్సరాల వయసు వచ్చేసరికి కావ్యశ్రీ కి గడ్డం, మీసాలు వచ్చాయి. దీంతో అసలు విషయం తెలుసుకునేందుకు ఆమెను బెంగళూరు తీసుకెళ్లాగా అసలు విషయం బయటకు వచ్చింది. అయితే క్రోమోజోముల లోపం వల్లే కార్తికేయ విషయంలో ఇలా జరిగిందని వైద్యులు చెబుతున్నారు. కొన్ని క్రోమోజోములు ఎక్కువగా డామినేట్ చేయడం వల్ల వృషణాలు చిన్న పరిమాణంలో ఉన్నాయని వైద్యులు వివరిస్తున్నారు. కార్తికేయలో టెస్టిక్యులర్ పెమినైజేషన్ సిండ్రోమ్ ఉండడం వల్లే ఇలా జరిగిందని వైద్యులు పేర్కొంటున్నారు. అయితే కార్తికేయకు ఫోటోగ్రఫీ చిన్నప్పటి నుంచి ఇష్టం. అందులోనే అతడు తర్ఫీదు పొందాడు. ప్రస్తుతం సినిమా టోగ్రఫగార్ గా పనిచేస్తున్నాడు.. తను అబ్బాయిగా జీవించడం ఆనందంగా ఉందని పేర్కొంటున్నాడు. అయితే కార్తికేయాలో టెస్టిక్యులర్ ఫెమినైజేషన్ సిండ్రోమ్ వల్ల బయటికి అమ్మాయిలాగా కనిపించాడని బెంగళూరు వైద్యులు చెబుతున్నారు. అయితే క్రోమోజోమ్ ల డామినేషన్ తగ్గిపోయిన తర్వాత అతడు యువకుడిగా మారాడని వివరిస్తున్నారు. అయితే ఈ ఘటన దుబ్బాక మండలంలో సంచలనంగా మారింది. ఈ ఘటనపై ఆ మండలంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.