https://oktelugu.com/

Electric Car Company Entering India: భారత్ లోకి అడుగుపెడుతున్న ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ.. ఏ దేశానికి చెందినదో తెలుసా?

దేశంలో ఎలక్ట్రిక్ కార్ల హవా పెరిగిపోతుంది. రోజులు పెరుగుతున్న కారు కొనాలని అనుకునేవారు విద్యుత్ కార్ల వైపే వెళ్తున్నారు. ఈ క్రమంలో కొన్ని కంపెనీలు సైతం ఈవీల ఉత్పత్తిపైనే ఫోకస్ పెడుతున్నాయి. భారతదేశంలో విదేశీ కార్లకు కూడా ఆదరణ పెరుగుతుడడంతో చాలా దేశాలకు చెందిన కార్లు భారత్ లో ఎంట్రీ ఇస్తున్నాయి

Written By:
  • Srinivas
  • , Updated On : November 17, 2024 / 07:00 AM IST

    CNG-Cars

    Follow us on

    Electric car company entering India: దేశంలో ఎలక్ట్రిక్ కార్ల హవా పెరిగిపోతుంది. రోజులు పెరుగుతున్న కారు కొనాలని అనుకునేవారు విద్యుత్ కార్ల వైపే వెళ్తున్నారు. ఈ క్రమంలో కొన్ని కంపెనీలు సైతం ఈవీల ఉత్పత్తిపైనే ఫోకస్ పెడుతున్నాయి. భారతదేశంలో విదేశీ కార్లకు కూడా ఆదరణ పెరుగుతుడడంతో చాలా దేశాలకు చెందిన కార్లు భారత్ లో ఎంట్రీ ఇస్తున్నాయి. లేటేస్ట్ గా వియత్నాం దేశానికి చెందిన ఓ కంపెనీ భారత్ లో కార్ల ఉత్పత్తి చేయడానికి ముందుకు వస్తుంది. ఇప్పటికే తమిళనాడులో ప్లాంట్ ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ కార్లు ఎలా ఉండనున్నాయంటే?

    ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కార్ల కంపెనీలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నారు. వీటిలో అతిపెద్ద బ్రాండ్లలో ఒకటైన విన్ ఫాస్ట్ (Vin Fast) భారత్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. భారత్ లో వివిధ కార్ల కంపెనీల ప్లాంట్ల ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారు. టెస్లా వంటి కంపెనీ కూడా రాబోతున్న తరుణంలో ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఇదేసమయంలో అతిపెద్ద కార్ల కంపెనీ విన్ ఫాస్ట్ భారత్ గడ్డపై అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది.

    ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరిలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో విన్ ఫాస్ట్ కంపెనీ ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతీ ఏడాది 1.50 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేసేందుకు హామీ ఇచ్చింది. ఇవన్నీ ఎలక్ట్రిక్ కార్లు కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్లాంట్ నిర్మాణం మొదలుపెట్టినట్లు సమాచారం. అయితే వచ్చే కొత్త ఏడాదిలో భారత మొబిలిటీ షో లో విన్ ఫాస్ట్ కు చెందిన మేడ్ ఇన్ ఇండియా కారు ప్రదర్శన ఇచ్చే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు.

    విన్ ఫాస్ట్ కు చెందిన ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే కాకుండా ఇతర వెహికల్స్ సైతం విక్రయాలు జరిపి వినియోగదారులను నుంచి ఆదరణ పొందుతోంది. ఇదిలా ఉండగా వియత్నాంలో ఈ కంపెనీ గత అక్టోబర్ లో 11,000 ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు జరుపుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 21 శాతం వృద్ధిని సాధించినట్లు తెలుస్తోంది. ఈ కంపెనీకి చెందిన విఎఫ్ 3, వీఎఫ్ 5 కార్లను ఎక్కువ మంది కొనుగోలు చేశారు. ప్రపంచ మార్కెట్లో వియత్నాం కార్ల కంపెనీ ప్రకంపనలు సృష్టిస్తోంది.

    ఈ తరుణంలో ఈ కంపెనీ భారత్ లోకి అడుగుపెట్టిన తరువాత కూడా ఆకర్షించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే దక్షిణ కొరియాకు చెందిన కియా, హ్యుందాయ కంపెనీలు భారత్ లో అడుగుపెట్టి సక్సెస్ సాధించాయి. భవిష్యత్ లో మరిన్ని కంపెనీలు వచ్చే అవకాశం ఉంది. అయితే వియత్నాంకు చెందిన ఈవీలు ఎక్కువగా ఆదరిస్తారని కంపెనీ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నేటి కాలంలో ఎక్కువ మంది ఈవీలు కోరుకుంటున్న తరుణంలో కొన్ని భారత్ కు చెందిన టాటా మోటార్స్, ఎంజీ మోటార్స్ కొత్త ఈవీలను ప్రవేశపెడుతున్నాయి. అయితే ఈ కార్లకు విన్ ఫాస్ట్ కార్లు గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.