https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : తన కోసం వచ్చిన యాంకర్ రవి కి చిరాకు రప్పించిన విష్ణు ప్రియ..నిన్ను మార్చలేము తల్లి అంటూ దండం పెట్టిన రవి!

ఈ వారం ఫ్యామిలీ వీక్ కంటెస్టెంట్స్ కి బోలెడంత బూస్ట్ అనే చెప్పొచ్చు. బయట వీళ్ళ ఆట గురించి ఆడియన్స్ ఏమి అనుకుంటున్నారు అనేది మొత్తం హౌస్ మేట్స్ కి అర్థమైపోతుంది. ఆ తర్వాత వీళ్ళు గేమ్ ని మార్చుకొని ఆడే తీరుని బట్టే, వీరిలో టాప్ 5 లోకి ఎవరు వెళ్ళబోతున్నారు, ఎవరు టైటిల్ కొట్టబోతున్నారు అనేది నిర్ణయింపబడుతుంది.

Written By:
  • Vicky
  • , Updated On : November 17, 2024 / 07:50 AM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8 :ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో అసలు జనాలు ఏమి అనుకుంటారో తనకి సంబంధం లేకుండా, మనసుకు నచ్చినట్టు, ఎంతో స్వచ్ఛంగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది విష్ణు ప్రియ మాత్రమే. తన గేమ్ నెగటివ్ అయిపోయి ఎలిమినేట్ అయినా పర్వాలేదు, తన మనసు ఏది చెప్తే అదే చేసుకుంటూ ముందుకు పోతుంది. ఇది ఆమెని ఇష్టపడేవాళ్ళకు చిరాకు రప్పించొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఈమెను కప్ కొడితే చూడాలని అనుకుంటున్నారు. కానీ విష్ణు మాత్రం నాకు ఏది అనిపిస్తే అదే చేస్తా అంటుంది. హౌస్ లో ఆమె పృథ్వీ ని ఎంత ప్రేమించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అతని కోసం ఎన్నో సేవలు చేసింది, అతను ఏడిస్తే ఈమె కూడా ఏడ్చేది, నా కంటే నువ్వే నాకు ఎక్కువ ఇష్టం అంటూ తన నోటి నుండి నేరుగా చెప్పేసింది. పృథ్వీ కూడా ఇక విష్ణు ప్రియ ప్రేమకి లొంగిపోయాడు. గత రెండు మూడు రోజుల నుండి ఆయన ఈమెతో చాలా స్నేహంగా ఉన్నాడు.

    ఇదంతా పక్కన పెడితే ఈ వారం ఫ్యామిలీ వీక్ కంటెస్టెంట్స్ కి బోలెడంత బూస్ట్ అనే చెప్పొచ్చు. బయట వీళ్ళ ఆట గురించి ఆడియన్స్ ఏమి అనుకుంటున్నారు అనేది మొత్తం హౌస్ మేట్స్ కి అర్థమైపోతుంది. ఆ తర్వాత వీళ్ళు గేమ్ ని మార్చుకొని ఆడే తీరుని బట్టే, వీరిలో టాప్ 5 లోకి ఎవరు వెళ్ళబోతున్నారు, ఎవరు టైటిల్ కొట్టబోతున్నారు అనేది నిర్ణయింపబడుతుంది. ఈ వారం విష్ణు ప్రియ తన గేమ్ జనాల్లోకి ఎలా వెళ్తుందో తన తండ్రి చెప్పుకొచ్చాడు. పృథ్వీ తో లవ్ ట్రాక్ వల్ల బయట చాలా నెగటివ్ అయిపోతున్నావు అని చెప్తాడు. నాకు ఇష్టమైన పృథ్వీ వల్లే నేను హౌస్ లో టాస్కులు బాగా ఆడగలుగుతున్నాను. అతను నా పాజిటివ్ ఎనర్జీ అని చెప్పుకొస్తుంది విష్ణుప్రియ. ఇక నీ ఇష్టం తల్లి అని ఆమె తండ్రి అనేస్తాడు. పృథ్వీ విషయం లో ఎవరు ఎన్ని చెప్పినా విష్ణు ప్రియ మారదు అనేది ఆడియన్స్ కి అర్థమైపోయింది.

    నిన్నటి ఎపిసోడ్ లో విష్ణు ప్రియ తరుపున గెస్ట్ గా యాంకర్ రవి రాగా, ఆయనతో పాటు విష్ణు చెల్లి కూడా వస్తుంది. వీళ్లిద్దరు బయట తన గేమ్ జనాల్లోకి ఎలా వెళ్తుందో చెప్పే ప్రయత్నం చేసారు. యాంకర్ రవి మాట్లాడుతూ ‘నాకంటే నువ్వే ఎక్కువ అని నువ్వు నేరుగా చెప్పేస్తే, ఆడియన్స్ నీకు ఎందుకు ఓట్లు వేస్తారు..అతనికే వేస్తారు కదా’ అని అంటాడు రవి. దానికి విష్ణు ప్రియ సమాధానం చెప్తూ ‘ఆడియన్స్ కి నేను ఎక్కువ ఇష్టం కాబట్టి ఇన్ని రోజులు నాకు ఓట్లు వేస్తూ, నన్ను నామినేషన్స్ నుండి సేవ్ చేసారు’ అని అంటుంది. ఆ తర్వాత విష్ణు ప్రియ చెల్లి మాట్లాడుతూ ‘గేమ్ బాగా ఆడు..నీ గురించి నువ్వు ఆలోచించుకో..పక్కవాళ్ళ గురించి అవసరం లేదు ‘ అని అంటుంది. ఇలా ఎన్ని చెప్పిన విష్ణు ప్రియ నామినేషన్స్ లో వాదించినట్టు వాదించడంతో యాంకర్ రవి కి చిరాకు కలిగింది. అనవసరం గా ఈమె కోసం వచ్చాను అనే ఫీలింగ్ ఆయన ముఖం లో కనపడింది పాపం.