CM Revanth Reddy : కోర్టులకు రాజ్యాంగం విశేష అధికారాలను కల్పించింది.. కోర్టు కూడా రాజ్యాంగానికి లోబడే పనిచేస్తుంది. అయితే నేరాలు, వివాదాల విషయంలో కోర్టులు ఇచ్చే తీర్పే ఫైనల్. కింది కోర్టు తీర్పుపై అభ‍్యంతరాలు ఉంటే పైకోర్టుకు వెళ్లొచ్చు. కానీ, తీర్పును తప్పు పట్టడం కానీ, జడ్జీల నిర్ణయాన్ని తప్పు పట్టడం కానీ నేరం. అది కోర్టు ధిక‍్కరణ కిందకు వస్తుంది. దీనిపై కోర్టులు సుమోటోగా స్పందించే అవకాశం ఉంది. గతంలో అనేక సందర్భాల్లో కోర్టు ధిక‍్కరణపై చర్యలు తీసుకున్నాయి. న్యాయస్థానాల ముందు అందరూ సమానమే. తాము అధికారులం, మంత్రులం, ముఖ్యమంత్రులం, ప్రధాన మంత్రిని అని మాట్లాడడం కూడా కుదరదు. తాజాగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌పై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటుకు నోటు కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా జగదీశ్‌రెడ్డి తరఫు న్యాయవాది రేవంత్ వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ‘మేం రాజకీయ పార్టీలతో చర్చించి ఆర్డర్ ఇవ్వాలా? ఓ సీఎం అలాంటి వ్యాఖ్యలు ఎలా చేయగలరు?’ అని మండిపడింది.
రేవంత్ ఏమన్నాడంటే..
బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య కుదిరిన డీల్ కారణంగానే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి బెయిల్ వచ్చిందనే చర్చ జరుగుతుందని మీడియా చిట్చాట్లో రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కవిత కోసం బీఆర్‌ఎస్ ఎంపీ సీట్లు త్యాగం చేసిందన్నారు. సిసోడియా, కేజ్రీవాల్‌కు రాని బెయిల్ కవితకు ఐదు నెలల్లోనే ఎలా వచ్చిందని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల్లో మెదక్, సిరిసిల‍్ల, సిద్దిపేట, గజ్వేల్‌లో బీజేపీకి మెజారిటీ వచ్చింది నిజం కాదా అన్నారు. ఏడుచోట్ల డిపాజిట్ కోలో‍్పయి. 15 చోట్ల మూడో స్థానానికి పిరిమితమయ్యేంత బలహీనంగా ఉందా బీఆర్‌ఎస్ అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సుప్రీం కోర్టు ఆగ్రహానికి కారణమయ్యాయి. రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను జగదీశ్‌రెడ్డి తరఫు న్యాయవాది గురువారం(ఆగస్టు 29న)సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ మిశ్రా, జప్టిస్ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం.. ‘రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి అలాంటి ప్రకటనలు ఎలా చేస్తారు’ అని ప్రశ్నించింది. ఈ క్రమంలోనే రేవంత్‌రెడ్డిని సుప్రీం కోర్టు తీవ్రంగా మందలించింది.
సాక్షులను ప్రభావితం చేయగలరు..
ఇదిలా ఉంటే.. రేవంత్‌రెడ్డిపై 2015లో నమోదైన ఓటుకు నోటు కేసు విచారణను మధ‍్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని కోరుతూ జగదీశ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారని, అతను సాక్షులను ప్రభావితం చేయగలరని, సాక్ష్యాలను తారుమారు చేయగలరని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ కేసు విచారణకు స్పెషల్ ప్రాసిక్యూటర్‌ను నియమిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. వాదోపవాదాల అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు తీర్పు చెప్పనున్నట్లు ధర్మాసనం పేర్కొంది. అయితే మధ్యాహ్నం విచారణ సందర్భంగా ధర్మాసనం సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించి తీవ్రంగా మందలించింది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: The supreme court questioned cm revanth reddy as to how a person holding a constitutional post can make such statements
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com