Christmas Holidays : సెలవులు అంటే చాలా మంది విద్యార్థులకు ఇష్టం ఉంటుంది. చిన్నతనంలో స్కూళ్లకు వెళ్లడం కంటే ఒక్క రోజు స్కూల్ సెలవు వచ్చిన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక్క రోజు ఆదివారం సెలవు వస్తేనే సరదాగా ఆటలు ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తారు. మళ్లీ ఇంకో రోజు సెలవు ఉంటే బాగుండేనని కోరుకుంటారు. సోమవారం మళ్లీ స్కూల్‌కు వెళ్లాలని అనుకోరు. పిల్లలకు సెలవులు అంటే అంత ఇష్టం ఉంటుంది. అందులోనూ ఏదైనా పండుగ ఉందంటే చాలు.. ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు. స్కూల్, హోం వర్క్‌లు లేకుండా చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే సెలవులను ఇలా ఎంజాయ్ చేయాలనుకునే విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. క్రిస్మస్ సందర్భంగా స్కూల్, కాలేజీలకు సెలవులను ప్రకటించింది. ప్రతి ఏడాది డిసెంబర్ 25న ఏసుక్రీస్తు జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఈ క్రమంలో కాలేజీలు, స్కూళ్లు, ఆఫీసులకు ప్రభత్వం సెలవులు ప్రకటిస్తుంది. అయితే ఈ ఏడాది క్రిస్మస్ సెలవులు ఏయే తేదీల్లో ఇవ్వనున్నారు? ఎన్ని రోజులు రానున్నాయి? ఎవరెవరికి సెలవులు ఇవ్వనున్నారనే పూర్తి విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తెలంగాణలో మూడు రోజుల పాటు ప్రభుత్వం క్రిస్మస్ సెలవులను ప్రకటించింది. డిసెంబర్ 24 నుంచి 26 వరకు స్కూళ్లకు సెలవులు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. అయితే తెలంగాణలో ఉన్న స్కూళ్లకు డిసెంబర్ 24 అనగా క్రిస్మస్ ఈవ్, డిసెంబర్ 25 అనగా బుధవారం క్రిస్మస్ పండుగ, డిసెంబర్ 26 అనగా గురువారం బాక్సింగ్ డే, జనరల్ హాలిడే సందర్భంగా మొత్తం మూడు రోజుల పాటు సెలవులు ఇచ్చారు. అయితే ఈ సెలవులు తెలంగాణలోని అన్ని జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు కూడా వర్తిస్తాయి. కానీ కొన్ని స్కూళ్ల వాళ్లు మూడు రోజుల పాటు కూడా సెలవులు ఇవ్వనున్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం క్యాలెండర్ ప్రకారం అయితే డిసెంబర్ 25, 26 తేదీల్లో పబ్లిక్ సెలవులుగా ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 24న ఆప్షనల్ హాలీడే ప్రకటించింది. అయితే క్రిస్టియన్ స్కూళ్లు, హాస్టళ్లకు సెలవులు ఇవ్వనున్నారు. ఇది అందరికీ వర్తించదు. కొన్ని పాఠశాలలకు 24వ తేదీన సెలవులు ఇవ్వకపోవచ్చు. ఏపీలో కేవలం డిసెంబర్ 25న మాత్రమే పబ్లిక్ హాలిడేగా ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 24, 26వ తేదీలు ఆప్షనల్‌గా ప్రకటించింది.
దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. దేశంలో కంటే విదేశాల్లో క్రిస్మస్ వేడుకలు కొన్ని రోజులు ముందే ప్రారంభమవుతాయి. ప్రస్తుతం దేశంలో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం సెలవులను ప్రకటించింది.