Telangana Congress : తెలంగాణ శాసన సభ ఎన్నికల సమరాన్ని కాంగ్రెస్ మొదలుపెట్టింది. ముందుగా తొలి జాబితాను రిలీజ్ చేసింది. మొత్తం 55 మందితో కూడిన మొదటి జాబితాను ఏఐసీసీ ప్రకటించింది. ఇందులో సీనియర్లు, ఆయా అసెంబ్లీ స్థానాల్లో పోటీలేని వారికి టికెట్లు కేటాయించింది.


-మైనంపల్లికి రెండు టికెట్లు.. ఉత్తమ్ కుటుంబానికి రెండు టికెట్లు..
ఇక ఒక కుటుంబానికి ఒక్క సీటు అన్న పట్టుదలను కాంగ్రెస్ పక్కన పెట్టింది. బీఆర్ఎస్ లో తన కుమారుడికి సీటు దక్కలేదని అలిగి కాంగ్రెస్ లో చేరిన మైనంపల్లికి అధిష్టానం అడిగిన రెండు సీట్లు ఇవ్వడం విశేషం. మల్కాజిగిరిని మైనంపల్లి హన్మంతరావుకు.. ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ రావుకు మెదక్ సీటును ఇచ్చింది.
ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డికి హుజూర్ నగర్ తోపాటు ఆయన భార్య పద్మావతికి కోదాడ టికెట్ రెండు టికెట్లను అధిష్టానం కేటాయించింది.
ఇక రేవంత్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి, జగిత్యాలకు జీవన్ రెడ్డి, నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సహా సీనియర్లందరికీ వారి సీట్లను కేటాయించింది.
కీలకమైన ఖమ్మం జిల్లాలో పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావులకు సీట్ల కేటాయింపు చేపట్టలేదు. తుమ్మలకు ఖమ్మం, పొంగులేటికి పాలేరు ఇస్తారని ప్రచారం సాగినా అది నెరవేరలేదు.