Excise Department: తెలంగాణలో రేవంత్ సర్కార్ ‘మందు’ జాగ్రత్త చర్యలు మొదలు పెట్టింది. గత వేసవిలో రాష్ట్రంలో బీర్ల కొరత ఏర్పడడంతో మందుబాబులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. మరోవైపు బీర్ల తయారీని నీటి కొరత కూడా ఏర్పడింది. వేసవి వచ్చిందంటే మందు బాబులు బీర్లు తాగేందుకే ఎక్కువగా ఆసక్తి చూపుతారు. సాధారణ రోజులకన్నా.. ఎండలు ఎక్కువగా ఉన్న రోజుల్లో బీర్లకు డిమాండ్ ఉంటుంది. ఏటా ఫిబ్రవరి నుంచే బీర్లకు డిమాండ్ మొదలవుతుంది, ఏప్రిల్, మే నెలల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో దీంతో వచ్చే వేసవిలో బీర్లకు కొరత రాకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మద్యాన్ని వీలైనంత ఎక్కువగా తాగించడమే లక్ష్యంగా బీర్ల తయారీ పెంచాలని బేవరేజెస్ నుంచి కంపెనీలకు ఆదేశాలు అందాయి. ఇప్పటి నుంచే ఒత్తిడి పెంచుతోంది.
డిమాండ్ మేరకు ఉత్పత్తి..
రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఓ బేవరేజెస్ కంపెనీ నెలకు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల కేసుల బీర్లు ఉత్పత్తి చేస్తుంది. ఎక్సైజ్ అధికారుల ఒత్తిడి మేరకు ఈ కంపెనీ నెలవారీ ఉత్పత్తిని 5 లక్షల కేసులకు పనెంచింది. ఇక మరో బేవరేజెస్ కంఎనీ నెలకు సుమారు 25 లక్షల కేసుల బీర్లు ఉత్పత్తి చేస్తుంది. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని దీని ఉత్పత్తిని 30 లక్షల కేసులకు పెంచినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అయితే బీర్లకు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. ఉత్పత్తి జరిగిన తేదీ నుంచి ఆరు నెలలు మాత్రమే వినియోగించాలి. దీంతో ఇప్పటి నుంచే ఉత్పత్తి పెంచుకుంటూ పోతే డిమాండ్‌కు సరపడా స్టాక్ అందుబాటులో ఉంచే అవకాశం ఉంటుందని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది.
అక్కడి నుంచే రాష్ట్రమంతా..
రాష్ట్రంలో బీర్ల తయారీ కంపెనీలు సంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాయి. యూబీ కంపెనీకి చెందిన రెండు యూనిట్లు, కల్స్‌బర్గ్, లీలాసన్స్, క్రౌన్, ఏబీ ఇన్‌బీస్ అనయూసర్–బుష్ వంటి కంపెనీల యూనిట్లు ఉన్నాయి. ఇవీ బీర్లు ఉత్పత్తి చేస్తున్నాయి. తెలంగాణ అంతటికీ ఈ కంపెనీల నుంచే బీర్లు సరఫరా అవుతున్నాయి. ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం.. జిల్లాలో ఉన్న బేవరేజెస్ కంపెనీల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 6,800 లక్షల లీటర్లు. ఈ బీర్ల తయారీకి అవసరమైన నీటి కోసం ఆయా కంపెనీలు ఏకంగా పైపులైన్లు వేసుకున్నాయి. కొన్ని కంపనెనీలు మంజీరా నీటిని వినియోగిస్తున్నాయి.