Ormax Stars India Loves 2024: పాన్ ఇండియా కాన్సెప్ట్ ప్రాచుర్యం పొందిన నేపథ్యంలో సౌత్ ఇండియాకు చెందిన పలువురు హీరోలు దేశవ్యాప్తంగా పాపులారిటీ రాబట్టారు. ఇండియాలో అత్యంత ఫేమ్ కలిగిన హీరో ఎవరని ఓ ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరి నెంబర్ వన్ హీరో ఎవరు? టాప్ 10లో ఎవరు ఉన్నారు? అనేది చూద్దాం..
సినిమాలను భాషా బేధం లేకుండా ఆదరిస్తున్నారు మూవీ లవర్స్. ఒకప్పుడు సౌత్ హీరోలకు నార్త్ లో మార్కెట్ ఉండేది కాదు. గత పదేళ్లుగా సమీకరణాలు మారిపోయాయి. బాహుబలి మూవీతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అనంతరం యష్, అల్లు అర్జున్ నార్త్ ఇండియాలో సత్తా చాటారు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో రామ్ చరణ్, ఎన్టీఆర్ సైతం నార్త్ లో గుర్తింపు రాబట్టారు. ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర హిందీలో ఆదరణ దక్కించుకుంది. దేవర హిందీ వెర్షన్ రూ. 60 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది.
ఇక పుష్ప 2తో అల్లు అర్జున్ బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇటీవల పాట్నాలో జరిగిన పుష్ప 2ట్రైలర్ లాంచ్ వేడుక బాలీవుడ్ వర్గాల్లో ప్రకంపనలు రేపింది. సౌత్ ఇండియా హీరోలు ఇండియన్ సినిమాను ఏలుతున్నారు అనడానికి మరో సర్వే ఉదాహరణగా నిలిచింది. ప్రముఖ బాలీవుడ్ మీడియా ఆర్మాక్స్ తాజాగా టాప్ టెన్ పాన్ ఇండియా హీరోల లిస్ట్ విడుదల చేసింది. ఈ లిస్ట్ లో కేవలం ఇద్దరు బాలీవుడ్ హీరోలకు మాత్రమే చోటు దక్కింది.
ఇక నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ నిలిచాడు. అతడికి అత్యంత పాపులారిటీ ఉందని ఆ సర్వే తేల్చింది. రెండో స్థానంలో విజయ్, మూడో స్థానంలో షారుఖ్ ఖాన్ ఉన్నారు. నాలుగో స్థానం ఎన్టీఆర్ కి దక్కింది. ఐదో స్థానంలో అజిత్ ఉన్నాడు. అల్లు అర్జున్ కి ఆరో స్థానం దక్కింది. ఏడో స్థానంలో మహేష్ బాబు ఉన్నారు. ఎనిమిదో స్థానంలో సూర్య, తొమ్మిదో స్థానంలో రామ్ చరణ్, చివరి స్థానంలో సల్మాన్ ఖాన్ నిలిచారు.
బాలీవుడ్ నుండి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లకు మాత్రమే టాప్ టెన్ లో చోటు దక్కింది. గతంలో అక్షయ్ కుమార్ టాప్ టెన్ లో ఉన్నారు. ఆయనకు ఈసారి స్థానం దక్కలేదు. టాలీవుడ్ నుండి ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్స్ టాప్ 10లో చోటు దక్కించుకున్నారు. పుష్ప 2, గేమ్ ఛేంజర్ విడుదలయ్యాక అల్లు అర్జున్, రామ్ చరణ్ ర్యాంక్స్ మెరుగయ్యే అవకాశం ఉంది.
Ormax Stars India Loves: Most popular male film stars in India (Oct 2024) #OrmaxSIL pic.twitter.com/t1qOxTGkKo
— Ormax Media (@OrmaxMedia) November 21, 2024