Hyderabad: డ్రంకెన్ డ్రైవ్ ను పోలీసులు ప్రతిరోజు నిర్వహిస్తూనే ఉంటారు. హైదరాబాద్ నగరంలో అయితే ఖరీదైన ప్రాంతాలలో.. పబ్ లు, డిస్కో లు ఉన్న ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు చేపడుతుంటారు. డ్రంకెన్ డ్రైవ్(drunken drive) లో స్త్రీలు, పురుషులు అనే సంబంధం లేకుండా చాలామంది దొరుకుతూనే ఉంటారు. పోలీసులు వారికి అపరాధ రుసుము, జైలు శిక్ష వంటి వాటిని విధిస్తూనే ఉంటారు. అయితే ఉప్పల్ ఎస్ హెచ్ వో రాజ్యలక్ష్మి వ్యవహార శైలి మాత్రం పూర్తి విభిన్నం. ఆమె ఫైన్, జైలు శిక్షతో సరిపెట్టుకోరు. తాగి రోడ్లమీదకి వచ్చేవరకు సరైన పనిష్మెంట్ ఇస్తుంటారు. ఇందులో భాగంగానే వారు మళ్లీ తాగకుండా సరికొత్త విధానాలను అవలంబిస్తుంటారు. ఇందులో భాగంగానే ఓ తాగుబోతు తండ్రిని తన కూతురి ద్వారా మార్పించారు. ఆమె మాటలతోనే అతడికి బుద్ధి వచ్చేలాగా చేశారు.
నాన్నా నువ్వు నాకు కావాలి
ఉప్పల్ ఎస్ హెచ్ వో గా బాధ్యతలు స్వీకరించిన రాజ్యలక్ష్మి(rajalakshmi) అనతి కాలంలోనే మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఆమె ప్రతిరోజు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో ఉప్పల్ (uppal) నుంచి వేరే ప్రాంతానికి తన ద్విచక్ర వాహనంపై భార్య, కూతుర్ని కూర్చోబెట్టుకుని వెళ్తున్న ఓ వ్యక్తి డ్రంకెన్ డ్రైవ్ లో దొరికాడు. అయితే రాజ్యలక్ష్మి నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ లలో అతడు అనేకసార్లు దొరికాడు. ఫైన్ కట్టడం.. మళ్లీ దొరికిపోవడం.. ఇలా సాగుతోంది అతడి తంతు. దీంతో అతడిని మార్చాలని రాజ్యలక్ష్మి భావించారు. డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిన అతడికి భారీగానే ఫైన్ విధించారు. ఆ తర్వాత తన కూతురు సమక్షంలోనే అతడు తాగుడు మాన్పించే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. బండి మీదనే కూర్చున్న కూతురితో ” నాన్నా నువ్వు నాకు కావాలి. అమ్మ, నువ్వు సంతోషంగా ఉంటే చూడాలి. మన కుటుంబం ఎప్పటికీ ఆనందంగా ఉండాలి. ఇవన్నీ జరగాలంటే నువ్వు తాగుడు మానేయాలి. తాగుడు మానేస్తావు కదూ.. ఇలా పోలీసులకు దొరకకుండా ఉంటావు కదూ..” అంటూ ఆ చిన్నారి అతని వద్ద ప్రామిస్ తీసుకుంది. తన కూతురు అలా మాటలు అనేసరికి ఆ వ్యక్తి చలించిపోయాడు. కన్నీటి పర్యంతమవుతూ తన కూతుర్ని దగ్గరికి తీసుకున్నాడు.. వెంటనే ఇకపై తాగనంటూ.. కచ్చితంగా కుటుంబంతో ఉంటానంటూ వాగ్దానం చేశాడు. ఈ వీడియోను కొంతమంది తమ ఫోన్లలో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఉప్పల్ ఎస్ హెచ్ వో రాజ్యలక్ష్మి వ్యవహరించిన తీరు పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమె అద్భుతమైన పని చేసిందని కొనియాడుతున్నారు.
డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన ఓ వ్యక్తిని ఉప్పల్ ఎస్ హెచ్ వో రాజ్యలక్ష్మి పూర్తిగా మార్చేశారు.. ఆ వ్యక్తిని తన కూతురు దగ్గర తీసుకెళ్లి.. నాన్నా నువ్వు నాకు కావాలి.. ఇకపై తాగకూడదు.. అని మాట తీసుకున్నారు. దానికి ఆ తండ్రి తన కూతుర్ని గుండెలకు హత్తుకొని ఎమోషనలయ్యారు. pic.twitter.com/l9aJIg0OAe
— Anabothula Bhaskar (@AnabothulaB) January 7, 2025