TGSRTC Cargo Service : TGSRTC గుడ్‌ న్యూస్‌.. ఇక బస్టాండ్‌కు వెళ్లే అవసరం లేదు.. దసరా నుంచి కొత్తగా సర్వీస్‌లు..

తెలంగాణ ఆర్టీసీ ఇప్పటికే ప్రయాణికుల కోసం అనేక సర్వీస్‌లు ప్రారంభించింది మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. కార్గో సర్వీస్‌లు అందుబాటులోకి తెచ్చింది. లాభాల కోసం కొత్త మార్గాలు అన్వేశిస్తోంది.

Written By: Raj Shekar, Updated On : September 29, 2024 1:37 pm

TGSRTC Cargo

Follow us on

TGSRTC Cargo Service : తెలంగాణలో నష్టాల బాటలో ఉన్న అనేక కార్పొరేషన్లలో ఆర్టీసీ కూడా ఒకటి. నిత్యం లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్న ఆర్టీసీ.. సంస్థను లాభాల్లోకి తీసుకురావడానికి అనేక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో టికెట్‌ చార్జీలు పెంచింది. బస్టాండ్లను ఆధునికీకరించింది. సౌకర్యాలు కల్పించింది. కొత్త బస్సులను కొనుగోలు చేస్తోంది. కార్గో సర్వీస్‌ల ద్వారా భారీగా ఆదాయం ఆర్జిస్తోంది. అయితే మహిళల ఉచిత ప్రయాణంలో మళ్లీ సంస్థకు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. దీంతో సంస్థను గట్టెక్కించేందకు మరోమారు సంస్థ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఆదాయం వచ్చే మరో మార్గం అన్వేశించింది. దీంతో ప్రయాణికులతోపాటు, సంస్థకూ లాభం కలుగుతుంది. కార్గొ వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇప్పటి వరకు బస్టాండ్‌కు కొరియర్‌ సర్వీస్‌ అందిస్తున్న ఆర్టీసీ.. ఇకపై ఇంటింటికీ సర్వీస్‌ అందించాలని నిర్ణయించింది. దసరా నుంచి ఈ సేవలను ప్రారంభించేందుకు చర్యలు చేపటì ్టంది. వినియోగదారులు ఆన్‌లైన్‌లో బుక్‌ చేయగానే సిబ్బంది నేరుగా ఇంటికి వచ్చి వస్తువులు తీసుకెళ్లి.. ఇచ్చిన అడ్రస్‌కు డోర్‌ డెలివరీ చేస్తారు.

హైదాబాద్‌లో ముందుగా..
ఇంటింటికీ కార్గో సన్వీస్‌ను మొదట హైదరాబాద్‌లో ప్రారంభించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఆర్డర్‌ పరిమాణాన్ని బట్టి 2/3/4 వీల్‌ ద్వారా డెలివరీ చేస్తారు. హైదరాబాద్‌లో సక్సెస్‌ అయిన తర్వాత అన్ని జిల్లాలలో దీనిని అమలు చేయనుంది. ప్రస్తుతం కార్గో సేవలు బస్‌ స్టేషన్‌ నుంచి బస్టేషన్‌ వరకు మాత్రమే ఉన్నాయి. ఇక నుంచి ఇంటింటికీ పార్శిల్‌ తీసుకెళ్లడం, ఇంటి నుంచి తీసుకురావడం వలన వినియోగదారులకు ఇబ్బందులు తప్పుతాయి. తాజా నిర్ణయంపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కొత్త బస్సులు ప్రారంభం..
ఇదిలా ఉంటే.. తెలంగాణలోని ఆరు డిపోల నుంచి ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ సూపర్‌ లగ్జరీ బస్సులను నడపనుంది. కరీంనగర్‌ –2, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్‌–2 డిపోల నుంచి ఈ బస్సులు నడుపుతుంది. కరీనంగర్‌–2 డిపోలో మొదట 35 బస్సులు రోడ్డు ఎక్కనున్నాయి వీటిని మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ప్రారంభిస్తారు. ఈ బస్సులు కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌జేబీఎస్‌కు, మంథని, గోదావరిఖని, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డికి నాన్‌స్టాప్‌ పద్ధతిలో నడుపుతారు.