Telangana vehicle registration : TG 09 9999 నెంబర్ కు ఎన్ని లక్షల పలికిందో తెలుసా?

ఏకంగా రూ.25.50,002 చెల్లించి నంబర్‌ సొంతం చేసుకుందని హైదరాబాద్‌ జేడీసీ సి.రమేశ్‌ తెలిపారు. మరికొన్ని ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా సోమవారం ఒక్కరోజే రవాణా శాఖకు రూ.43,70,284 ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు.

Written By: NARESH, Updated On : May 21, 2024 7:46 pm
Follow us on

Telangana vehicle registration : చాలా మంది వాహనదారులు తమ వాహనాల రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఫ్యాన్సీగా ఉండాలని భావిస్తుంటారు. ఇందుకోసం లక్కీ నంబర్‌, ఇతర ఫా‍్యన్సీ నంబర్లు వచ్చేలా ప్రయత్నిస్తుంటారు. కొందరు నంబర్‌పై చాలా ఫోకస్‌ పెడతారు. మంచి నంబర్‌ రావాలని కోరుకుంటారు. మరికొందరు సెంటిమెంటు, జ్యోతిష్యం ప్రకారం కలిసివచ్చే నంబర్‌ తీసుకుంటారు. చాలా మంది నచ్చిన నంబర్‌ కోసం డబ్బులు కూడా ఖర్చు పెడుతుంటారు. వాహనదారుల ఆసక్తిని గమనించిన రవాణా శాఖ, ఫ్యాన్సీ నంబర్లను ముందే బ్లాక్‌ చేసి వేలం వేస్తోంది. దీంతో వాహనదారులు ఆ నంబర్ల కోసం భారీగా డబ్బులు ఖర్చు చేసి వేలంలో దక్కించుకుంటున్నారు.

రికార్డు ధర పలికిన నంబర్‌..
ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా రవాణా శాఖకు భారీగా ఆదాయం సమకూరుతోంది. ఈ క్రమంలో తాజాగా ఓ వామనదారుడు ఫా‍్యన్సీ నంబర్‌ కోసం రికార్డు ధర చెల్లించాడు. రాష్ట్రంలోనే తొలిసారిగా వాహన ఫ్యాన్సీ నంబర్‌ను వేలంలో రూ.25.50 లక్షలకు దక్కించుకున్నాడు. రవాణా శాఖ చరిత్రలో నంబర్‌కు ఇంత ధర పలకడం ఇదే తొలిసారని అధికారులు పేర్కొంటున్నారు.

ఎక్కడంటే..
ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో సోమవరాం(మే 20న) కొత్త సిరీస్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆన్‌లైన్‌ వేలం నిర్వహించారు. ఇందులో టీజీ09 9999 నంబర్‌ను సోనీ ట్రాన్స్‌పోర్టు సొల్యూషన్స్‌ సంస్థ తమ టయోటా ల్యాండ్‌ ​క్రూడజర్‌ ఎల్‌ఎక్‌స కోసం వేలంలో పోటీ పడింది. ఏకంగా రూ.25.50,002 చెల్లించి నంబర్‌ సొంతం చేసుకుందని హైదరాబాద్‌ జేడీసీ సి.రమేశ్‌ తెలిపారు. మరికొన్ని ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా సోమవారం ఒక్కరోజే రవాణా శాఖకు రూ.43,70,284 ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు.