https://oktelugu.com/

OTT Release : ఈ వారం ఓటీటీలో ఆ మూడు క్రేజీ చిత్రాలు… డోంట్ మిస్!

ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. క్రూ చిత్ర డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్న నేపథ్యంలో మె 24 నుండి స్ట్రీమ్ కానుంది.

Written By:
  • NARESH
  • , Updated On : May 21, 2024 / 06:37 PM IST

    Prasannavadanam

    Follow us on

    OTT Release : ఈ వారం మూడు క్రేజీ మూవీస్ ఓటీటీలో ప్రేక్షకులను అలరించనున్నాయి. యాక్షన్, కామెడీ, క్రైమ్ జోనర్స్ కి చెందిన ఈ చిత్రాలు ప్రేక్షకులకు ఫీస్ట్ అనడంలో సందేహం లేదు. వాటిలో ఒకటి ప్రసన్నవదనం. ఎలాంటి నేపథ్యంలో లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టాడు సుహాస్. సపోర్టింగ్ రోల్స్ నుండి హీరో స్థాయికి ఎదిగాడు. సుహాస్ ఎంచుకునే సబ్జక్ట్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. వరుస విజయాలు అందుకుంటున్నాడు. ఆయన లేటెస్ట్ మూవీ ప్రసన్నవదనం. ఈ చిత్రం కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మే 3న విడుదలైన ప్రసన్న వదనం నాలుగు వారాలు ముగియక ముందే ఓటీటీలోకి వచ్చేస్తుంది.

    ప్రసన్న వదనం ఓటీటీ హక్కులు తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహా సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మే 24నుండి ప్రసన్న వదనం అక్కడ స్ట్రీమ్ కానుంది. ఫేస్ బ్లైండ్నెస్ అనే ఒక రుగ్మత ఆధారంగా ప్రసన్న వదనం మూవీ తెరకెక్కింది. ప్రమాదానికి గురైన హీరో సుహాస్ ఈ ఫేస్ బ్లైండ్నెస్ అనే వ్యాధితో బాధపడుతూ ఉంటాడు.

    మే 24న ఓటీటీ విడుదలకు సిద్ధం అవుతున్న మరొక చిత్రం రత్నం. యాక్షన్ హీరో విశాల్ నటించాడు. సింగం ఫేమ్ హరి ఈ చిత్ర దర్శకుడు.అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన రత్నం మూవీ ఏప్రిల్ 26న విడుదలైంది. సముద్రఖని కీలక రోల్ చేశాడు. ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించింది. రత్నం ఆశించిన స్థాయిలో ఆడలేదు. విశాల్ నటనకు మాత్రం మార్క్స్ పడ్డాయి. రత్నం మూవీ డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. మే 24 నుండి రత్నం ఓటీటీలో స్ట్రీమ్ కానుంది.

    బాలీవుడ్ మూవీ క్రూ ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సంచలనం నమోదు చేసింది. కరీనా కపూర్, టబు, కృతి సనన్ ప్రధాన పాత్రలు చేశారు. ఈ ముగ్గురు హీరోయిన్స్ విమాన సిబ్బంది పాత్రల్లో నటించారు. కామెడీ హీస్ట్ డ్రామాగా తెరకెక్కింది. క్రూ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు మంచి వసూళ్లు రాబట్టింది. రూ. 75 కోట్లతో తెరకెక్కిస్తే రూ. 156 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. క్రూ చిత్ర డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్న నేపథ్యంలో మె 24 నుండి స్ట్రీమ్ కానుంది.