https://oktelugu.com/

International Tea Day : ఛాయ్ ఎందుకు తాగాలి.. తాగితే ప్రయోజనం ఎంత? టీ డే చరిత్ర ఇదీ

బరువు తగ్గించాలనుకునే వారికి కొన్ని ప్రత్యేక టీలు ఉంటాయి. ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహించడం ద్వారా బరువు తగ్గవచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : May 21, 2024 / 08:11 PM IST

    International Tea Day

    Follow us on

    International Tea Day : ‘చాయ్ (టీ) చటుక్కున తాగరా భాయ్’ మన మెగాస్టార్ స్వయంగా పాడిన పాట గుర్తుండే ఉంటుంది కదా.. అందులో అన్నగారు చాయ్ తో కలిగే లాభాలను పూసగుచ్చినట్లుగా చెప్పారు. టీని ప్రేమించని వాడు జగతిపై ఉండరని మెగా బ్రదర్ ఆనాడే చెప్పాడు. ప్రపంచ వ్యాప్తంగా సాంస్కృతిక ప్రాముఖ్యత, గొప్ప చరిత్ర కలిగి ఉన్న టీకి మే 21 ను అంతర్జాతీయ టీ దినోత్సవంగా గుర్తిస్తారు. గుడిసెలో ఉన్న పేదవాడి నుంచి బంగ్లాలో ఉన్న ధనవంతుల వరకు తాగే పానీయం టీ.

    టీ గురించి వర్ణించాలంటే మాటలు, పాటలు సరిపోవేమో. టీ పొడిలో ఉన్న కొన్ని కారకాలు మెదడును ఉత్తేజపరిచి పనిపై శ్రద్ధను పెంచుతాయి. కూలి పని చేసుకునే వాడు రిలాక్స్ కోసం టీ తాగితే.. పరిశోధకులు మెదడును మరింత ఉత్తేజానికి లోను చేసేందుకు టీ తాగుతారు. టీ వల్ల ఉన్నన్ని లాభాలు మరేదాని వల్ల లేవు.

    అంతర్జాతీయ టీ డే
    అంతర్జాతీయ టీ దినోత్సవం కోసం మొదటి ఉద్యమం 2005లో ప్రారంభమైంది, ఆసియా, ఆఫ్రికాలోని కార్మిక సంఘాలు, చిన్న తేయాకు పెంపకందారులు, సామాజిక సంస్థలు దీన్ని సమర్థించాయి. తేయాకు ఉత్పత్తిదారులకు న్యాయమైన ధరలు, కార్మికులకు వేతనాల ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడం వారు లక్ష్యంగా పెట్టుకున్నారు.

    ఐక్యరాజ్యసమితి మే 21వ తేదీని అంతర్జాతీయ ‘టీ’ దినోత్సవంగా ప్రకటించింది. టీ యొక్క సుదీర్ఘ చరిత్ర, సంస్కృతిక ప్రాముఖ్యత, సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడం, తేయాకు పండించే ప్రాంతాల్లో పేదరికంతో పోరాడడంలో దాని పాత్రను నిర్వహిస్తోంది.

    1. చమోమిలే టీ
    ఒత్తిడిలో ఉంటే చమోమిలే టీ తాగితే శాంతపడతారు. ఈ టీ ప్రయోజనాలు విశ్రాంతికి మించి విస్తరించి ఉంటాయనడంలో సందేహం లేదు. జీర్ణక్రియ శక్తిని పెంచడమే కాకుండా రుతుక్రమ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

    2. కాశ్మీరీ కహ్వా టీ
    శక్తివంతమైన శాంతపరిచే లక్షణాలకు ప్రసిద్ది చెందిన గ్రీన్ టీ. కుంకుమ పువ్వు, సుగంధ ద్రవ్యాల ప్రత్యేక కలయిక సంప్రదాయ కశ్మీరీ పానీయం. యాలకులు, దాల్చిన చెక్క, ఇతర సుగంధ ద్రవ్యాలు వెచ్చదనం అందిస్తుంది. ఇది రోజును ప్రారంభించడానికి, సాయంత్రం వేళ ఆహ్లాదంగా ఉంచేందుకు తోడ్పడుతుంది.

    3. రోగనిరోధక శక్తిని పెంచే టీలు
    యాంటీ ఆక్సిడెంట్లు, అల్లం, ఇలాచీలు వంటి ప్రయోజనకరమైన మూలికలతో నిండి ఉంది. ఈ పవర్ హౌజ్ పదార్థాలు మీరు ఆరోగ్యంగా ఉండేందుకు, రోజువారీ సవాళ్లతో పోరాడేందుకు సాయపడుతుంది. ఏడాది పొడవునా మీకు ఉత్తమమైన అనుభూతిని కలిగిస్తాయి.

    4. బరువు తగ్గడానికి హెర్బల్ టీలు
    బరువు తగ్గించాలనుకునే వారికి కొన్ని ప్రత్యేక టీలు ఉంటాయి. ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహించడం ద్వారా బరువు తగ్గవచ్చు.