Telangana Local Body Elections: తెలంగాణలో ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. దాదాపు ఏడాదిన్నరగా పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్‌లు పాలకవర్గాలు లేక పనులు ముందుకు సాగడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. ఇప్పుడు అప్పుడు అంటూ ఇన్నాళ్లూ దాటవేస్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది.
షెడ్యూల్ ప్రకటించిన ఎస్ఈసీ..
రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) స్థానిక సంస్థలకు సంబంధించిన షెడ్యూల్‌ను సోమవారం(సెప్టెంబర్29న) ప్రకటించింది. జిల్లా , మండల పరిషత్ ఎన్నికలు ముందు నిర్వహించాలని నిర్ణయించింది. తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని విస్తృత భౌగోళిక వైవిధ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఎస్ఈసీ షెడ్యూల్ రూపొందించింది. అక్టోబర్ 9వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం ఐదు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్ 9వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై నవంబర్ 11వ తేదీన ముగుస్తుందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. తాము టైమ్ షెడ్యూల్ ఖరారు చేసుకున్నామని వివరించారు.
1.67 కోట్ల మంది ఓటర్లు..
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.67 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో మహిళల పాత్రను బలపరుస్తుంది.
ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలి..
స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులకు ఇద్దరు సంతానం మాత్రమే అనుమతించే నియమం ఇప్పటికీ అమలులో ఉంది, ఇది 1995 తర్వాత జన్మించినవారికి వర్తిస్తుంది. అయితే ఈసారి ఈ నిబంధన ఎత్తేస్తారని అశావహులు భావించారు. కానీ, ఈసీ ఈ నిబంధనలో ఎలాంటి మార్పు చేయలేదు.
రాజకీయ పార్టీల వ్యూహాలు..
ప్రధాన పార్టీలు తమ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయి. వ్యూహ రచన చేస్తున్నాయి. గ్రామీణాభివృద్ధి వాగ్దానాలపై దృష్టి పెడుతున్నాయి. ప్రత్యేకించి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నికల సమయంలో ప్రకటించబడినప్పుడు. మొత్తంగా, ఈ ఎన్నికలు స్థానిక సమస్యలను జాతీయ స్థాయికి తీసుకువెళ్లే అవకాశాన్ని అందిస్తాయి, కానీ అవినీతి నియంత్రణ అవసరం.
ఎన్నికల నగారా ఇలా..
జిల్లాలు 31
మండలాలు 565
జెడ్పీటీసీ 565
ఎంపీటీసీ 5749
ఎంపీటీసీ పోలింగ్ స్టేషన్లు 31.300
ఎంపీటీసీ/జెడ్పీటీసీ పోలింగ్ కేంద్రాలు 15,302
పంచాయతీల వివరాలు
గ్రామపంచాయతీలు 12,733
వార్డులు 1,12,288
పోలింగ్ స్టేషన్లు 1,12,474
పోలింగ్ కేంద్రాలు 15,522
ఓటర్లు
పురుషులు 81,65,894
మహిళలు 85,36,770
ఇతరులు 504
మొత్తం ఓటర్లు 1,67,03,168
జిల్లాల వారీగా రిజర్వేషన్ల జాబితా ఇదీ..
జిల్లా పరిషత్ రిజర్వేషన్
1. ఖమ్మం ఎస్టీ (పురుషులు (మహిళలు)
2. నిజామాబాద్ బీసీ (మహిళలు)
3. ములుగు ఎస్టీ (మహిళలు)
4. సిద్దిపేట బీసీ (పురుషులు/మహిళలు)
5. నల్గొండ ఎస్టీ (మహిళలు)
6. సూర్యాపేట బీసీ (పురుషులు,మహిళలు)
7. వరంగల్ ఎస్టీ (పురుషులు/మహిళలు)
8. వికారాబాద్ బీసీ (పురుషులు/మహిళలు)
9. హనుమకొండ ఎస్సీ (మహిళలు)
10. వనపర్తి బీసీ (మహిళలు)
11. యాదాద్రి భువనగిరి బీసీ (మహిళలు)
12. జనగామ ఎస్సీ (మహిళలు)
13. ఆదిలాబాద్ బీసీ (మహిళలు)
14. జోగులంబ గద్వాల ఎస్సీ (పురుషులు,మహిళలు)
15. భద్రాద్రి కొత్తగూడెం అస్రిజర్వ్ (మహిళలు)
16. రాజన్న సిరిసిల్ల ఎస్సీ (పురుషులు/మహిళలు)
17. రంగారెడ్డి ఎస్పీ (మహిళలు)
18. సంగారెడ్డి ఎస్సీ (పురుషులు/మహిళలు)
19. కామారెడ్డి అన్‌రిజర్వు (మహిళలు)
20. జయశంకర్ భూపాలపల్లి బీసీ (పురుషులు/మహిళలు)
12. కరీంనగర్ బీసీ (పురుషులు/మహిళలు)
22. మహబూబాబాద్ అన్‌రిజర్వడ్ (పురుషులు/మహిళలు)
23. కుమ్రంభీం ఆసిఫాబాద్ బీసీ (పురుషులు/మహిళలు)
24. మెదక్ అన్‌రిజర్వడ్ (పురుషులు/మహిళలు)
25. మహబూబ్‌నగర్ బీసీ (మహిళలు)
26. మంచిర్యాల బీసీ (మహిళలు)
27. నాగర్ కర్నూల్ బీసీ (మహిళలు)
28. నారాయణపేట అన్ రిజర్వ్ (మహిళలు)
29. నిర్మల్ బీసీ (పురుషులు, మహిళలు)
30. పెద్దపల్లి అన్ రిజర్వ్డ్ (మహిళలు)