The Raja Saab Telugu Trailer Review : ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న ‘రాజాసాబ్ ‘ సినిమా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన పేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రభాస్ నుంచి గత కొన్నిసంవత్సరాల నుంచి ప్యూర్ కామెడీ సినిమాలైతే రావడం లేదు. ఎంతసేపు ఎలివేషన్, ఎమోషన్స్, యాక్షన్ సినిమాలను చేస్తున్న ప్రభాస్ మధ్యలో కాస్త రిలాక్సేషన్ కోసం రాజాసాబ్ సోనియా వేస్తున్నాడు. ఇక ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని గత కొద్దిసేపటికి మీరు రిలీజ్ చేశారు… హారర్ కామెడీ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రభాస్ అభిమానులు మంత్రముగ్ధుల్ని చేస్తుంది అంటూ గత కొన్ని రోజుల నుంచి దర్శకుడు మారుతి చాలా క్లారిటీగా చెబుతున్నారు. ఇక ట్రైలర్ ని కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే రాజాసాబ్ ఇంట్లోకి ఎంటర్ అయిన ప్రభాస్ అండ్ టీం అక్కడ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు, అక్కడి నుంచి బయటపడ్డారు… ప్రభాస్ వాళ్ళ తాత క్యారెక్టర్ చేసిన సంజయ్ దత్ ఈ సినిమాలో దెయ్యం గా కనిపించబోతున్నాడు… ఇక ట్రైలర్లో విజువల్స్ బాగున్నాయి. ఒక స్టార్ హీరో సినిమాకి ఎలాంటి గ్రాండియర్ అయితే కావాలో అది ఈ ట్రైలర్ లో కనిపించింది. ట్రైలర్ స్టార్టింగ్ లో ఒక వాయిస్ వినిపించింది. ఆ వాయిస్ ని చూస్తే బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ మాట్లాడినట్టుగా అనిపించింది. ఈ సినిమాను సైతం బిగ్ బాస్ షో లానే డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ సినిమా మొత్తం 90% ఒక ఇంట్లోనే ఉండబోతోంది. ఇక ప్రభాస్ ఈ మూవీలో కామెడీని ట్రై చేసినప్పటికీ అంత ఎఫెక్ట్ గా అనిపించలేదు. ఒకప్పటి కామెడీ టోన్ అయితే రావడం లేదు. ఆయన చేస్తున్న కామెడీ ఫోర్స్డ్ గా చేస్తున్నట్టుగా అనిపించింది. తప్ప జెన్యూన్ కామెడీ కనిపించలేదు… తెలుగులో హార్రర్ కామెడీ జానర్ లో వచ్చిన సినిమాలు చాలా తక్కువ… ఇంతకుముందు మారుతి డైరెక్షన్ లో వచ్చిన ప్రేమ కథ చిత్రం ఇలాంటి నేపథ్యంలోనే తెరకెక్కింది. ఆ మూవీ సూపర్ సక్సెస్ ని సాధించింది.
గతిలో మారుతి చేసిన ప్రేమ కథ చిత్రాన్ని కొంచెం అటు ఇటు చేసి ఈ సినిమా చేస్తున్నాడు అంటూ సినిమా విమర్శకులు గత కొన్ని రోజుల నుంచి కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం చేశారు. కానీ ట్రైలర్ చూస్తే మాత్రం ఈ సినిమా సెటప్ చాలా పెద్దదిగా తెలుస్తోంది… కేవలం ప్రభాస్ ఇంట్లోకి సంజయ్ దత్ ఆత్మ వచ్చిన తర్వాత ఆయన ఆ ఇంట్లో ఎలాంటి బీభత్సాన్ని క్రియేట్ చేశాడు అనేది కూడా చాలా క్లియర్ గా చూపించారు.
ముఖ్యంగా పాస్ట్ షాట్ అయితే అద్భుతంగా ఉంది… ఇంట్లో ప్రభాస్ రివర్స్లో ఫ్లోర్ పైన కూర్చోవడం అతన్ని కొట్టడానికి వచ్చిన రౌడీలు అందరూ రివర్స్ లోకి మారిపోవడం లాంటి షాట్స్ ఈ ట్రైలర్ కి హైలెట్ గా నిలిచాయి. ఇక ఈ ట్రైలర్లో మైనస్ ఏదైనా ఉంది అంటే అవి ప్రభాస్ డైలాగులనే చెప్పాలి. ఆయన చెప్పిన డైలాగ్స్ క్లారిటీగా లేవు ఏదో ఇబ్బందితో చెప్పినట్టుగా అనిపించింది. ఇక డైరెక్టర్ సైతం హార్రర్ గోలిపే సన్నివేశాలనైతే ఎఫెక్టివ్ గా చూపించలేకపోయాడు…
ప్రస్తుతం హాలీవుడ్ లో హార్రర్ సినిమాలను చూస్తున్న జనాలు భయపడే అవకాశం అయితే లేనట్టుగా తెలుస్తోంది…తమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు…ఇక షాట్స్ కొంతవరకు బాగున్నప్పటికీ కొన్ని షాట్లలో గ్రీన్ మ్యాట్ వేసి షట్ చేసినట్టుగా తెలిసిపోతోంది. ఇక గ్రాఫిక్స్ చేసిన సన్నివేశాలు సైతం చాలా క్లియర్ గా తెలిసిపోతున్నాయి. ఈ ట్రైలర్ టెక్నికల్ గా ఇంకాస్త స్ట్రాంగ్ గా ఉంటే బాగుండేది…