Telangana Real Estate Prices: విశ్వనగరంగా హైదరాబాద్ కీర్తి ఘడించడంతో రాజధానిలో భూములకు మస్తు డిమాండ్ పెరిగింది. ప్రభుత్వ ధరలకు పదింతలు ధర పలుకుతోంది. దీంతో సామాన్యులు రాజధానిలో భూములు కొనలేని పరిస్థితి నెలకొంది. ఇక సంపన్నులు మాత్రమే భూములు కొని వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వాలు కూడా భూములను వేలం వేస్తూ ఆదాయం సమకూర్చుకుంటున్నాయి. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం మరోమారు భూముల వేలానికి సిద్ధమైంది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీ ఐఐసీ) ఆధ్వర్యంలో ఉస్మాన్ సాగర్‌లో 46 ఎకరాలు, రాయదుర్గంలో 20 ఎకరాలతోసహా మొత్తం 17 ప్లాట్లను వేలం వేయడానికి సన్నాహాలు చేస్తోంది.
Also Read: మద్యం బాబులకు గుడ్ న్యూస్..
రాయదుర్గం రూ.100 కోట్లకుపైనే..
రాయదుర్గంలో భూమి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక ఎకరం రూ.104 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. అంటే చదరపు గజం ధర రూ.2 లక్షలకుపైనే. ఈ అధిక ధరలు హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌కు ఉన్న డిమాండ్‌ను సూచిస్తున్నాయి. రాయదుర్గం వంటి ప్రాంతాలు వాణిజ్య, ఐటీ హబ్‌గా మారడంతో భూమి విలువ గణనీయంగా పెరిగింది.
వేలం తేదీలు..
– దరఖాస్తు గడువు ఆగస్టు 8
– టెండర్ అవార్డు ఆగస్టు 12
Also Read: నోట్లపై ఉండే ఈ గీతల అర్థం తెలుసా?
ఈ వేలం ప్రక్రియ పారదర్శకంగా, పోటీతత్వంతో జరిగేలా టీజీఐఐసీ చర్యలు చేపడుతోంది. ఆసక్తి ఉన్న పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ సంస్థలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ భూముల వేలం హైదరాబాద్ ఆర్థిక వృద్ధికి ఊతం ఇవ్వనుంది. అధిక ధరలతో వేలం వేయబడే ఈ భూములు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడమే కాక, కొత్త వాణిజ్య ప్రాజెక్టులకు, ఉపాధి అవకాశాలకు దారితీస్తాయి. అయితే, భూమి ధరల పెరుగుదల సామాన్య ప్రజలకు గృహనిర్మాణ ఖర్చులను పెంచే అవకాశం ఉంది.