Farmer Sacrifices Life for His Bulls: మనుషులకు, పశువులకు ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది. వీటిలో పాడి పశువులు అయితే కొందరు రైతులు తమ కన్నబిడ్డల్లాగా చూసుకుంటారు. వాటితో ఎంతో పని చేయించినా.. వాటికి ఏ చిన్న సమస్య వచ్చినా తల్లడిల్లి పోతుంటారు. ఒక్కోసారి గ్రాసం లేక వాటిని అమ్ముకోవడానికి కూడా మనసు రాదు. అలాంటిది పశువులు మరణిస్తే ఇంట్లో వ్యక్తి మరణించినట్లే ఏడ్చేవారు కూడా ఉన్నారు. అలాంటి పశువులు నీళ్లలో కొట్టుకొని పోతుంటే ఎవరైనా ఏం చేస్తారు? కొందరైతే తమ ప్రాణం ఎక్కడ పోతుందోనని భయపడి పక్కకు తప్పుకుంటారు. అవి పశువులే కదా.. అని మరికొందరు బాధపడతారు.. కానీ ఓ రైతు మాత్రం ఏం చేశాడో తెలుసా?
భారతదేశం వ్యాప్తంగా వర్షాలు ఉద్యమిస్తున్నాయి. ఈ క్రమంలో వాగులు, వంకలు పొంగి పొర్లి ప్రవహిస్తున్నాయి. నీ వరదల్లో కొన్నిచోట్ల ఇల్లు కూడా కొట్టుకుపోయాయి. కొన్నిచోట్ల అయితే మనుషులు కూడా ఇందులో గల్లంతయ్యారు. అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా వరదలు ఏరులై పారుతున్నాయి. ఈ రాష్ట్రంలోని చింద్వారా జిల్లాలోని పరాయి గ్రామ పరిధిలో వరదలు అకస్మాత్తుగా వచ్చాయి. దీంతో ఈ గ్రామంలో ఉన్న నది ఒడ్డున ఓ రైతు తన ఎద్దుల బండితో ఆగిపోయాడు. అయితే వరద మరింత పెరగడంతో ఒక్కసారిగా బండితో సహా ఎద్దులు అందులో కొట్టుకుపోయాయి. దీంతో ఆ రైతు సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు. తన ఎద్దులను కాపాడుకునేందుకు ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలోకి దూకాడు.. ఆ తర్వాత ఒకటి తర్వాత మరొక ఎద్దును సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు.
తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఎద్దులను కాపాడిన రైతును పలువురు ప్రశంసిస్తున్నారు. అయితే ఒక్కోసారి ఇలాంటి సాహసాలు ప్రాణాలకే ప్రమాదాన్ని తీసుకొస్తాయి. ఎందుకంటే అన్నివేళలా ఇలా ఎద్దులను వరదలో నుంచి తీసుకురావడం సాధ్యం కాదు. ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 30 జిల్లాలకు వరద హెచ్చరికలు జారీ చేశారు. భూపాల్ నగరంలో అనేక రోడ్లను మూసివేశారు. అయితే మరికొన్ని చోట్ల కూడా ఇలాంటి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ముఖ్యంగా నది పరివాహక ప్రాంతాల్లో రోడ్లను మూసి వేయించాలని తెలుపుతున్నారు. వరదలు అకస్మాత్తుగా వస్తుండడంతో.. ఏ క్షణంలో తమ ఇళ్లు మునిగిపోతాయని భయాందోళనలో ఉన్నారు.
ముఖ్యంగా వ్యవసాయానికి వెళ్లే రైతులు వరద ఉధృతిని దృష్టిలో ఉంచుకొని తమ పనులు చేసుకోవాలని కొందరు అధికారులు తెలుపుతున్నారు. వరద వచ్చే పరిస్థితి ఉంటే వ్యవసాయ పనులకు వెళ్లకుండా ఉండాలని అంటున్నారు. అంతేకాకుండా తమకు సంబంధించిన పశువులను సురక్షిత ప్రాంతంలో ఉంచుకోవాలని తెలుపుతున్నారు. వరద ముప్పు ఉన్న గ్రామాల్లో ప్రజలు అధికారులను సంప్రదించి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి.
View this post on Instagram