HomeతెలంగాణTelangana Political Crisis: బామ్మర్ధి కళ్లల్లో ఆనందం కోసం హరీష్ రగిలిస్తోన్న ‘సెంటిమెంట్’

Telangana Political Crisis: బామ్మర్ధి కళ్లల్లో ఆనందం కోసం హరీష్ రగిలిస్తోన్న ‘సెంటిమెంట్’

Telangana Political Crisis: బీఆర్‌ఎస్‌ నేతలకు కష్టం వచ్చిందంతే తెలంగాణ వాదం.. జై తెలంగాణినాదం గుర్తొస్తుంది. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ పరిస్థితి ఏమీ బాగాలేదు.. గులాబీ బాస్‌ కేసీఆర్‌ గృహానికే పరిమితమవుతున్నారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌.. గులాబీ బాస్‌ తనయుడు కేటీఆర్‌.. సీఎం రేవంత్‌రెడ్డిని తిట్టడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. ఇక గులాబీ బాస్‌ కూతురు సొంత కుంపటి పెట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. మరో కీలక నేత హరీశ్‌రావు ఒక్కరే పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్‌ మెప్పు.. కేటీఆర్‌ కళ్లలో ఆనందం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read: నల్గొండ జిల్లాలో లిల్లీపుట్ నాయకుడు ఎవరు.. కవిత ఆ స్థాయిలో విమర్శలు చేయడానికి కారణమేంటి?

తెలంగాణ వాదం.. నినాదమే బీఆర్‌ఎస్‌ ఆక్సీజన్‌.. కష్టకాలంలో ప్రాంతీయవాదాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించడం సర్వసాధారణం. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ వ్యూహం పార్టీకి గణనీయమైన మద్దతు తెచ్చిపెట్టినప్పటికీ, ప్రస్తుతం ఈ విధానం ప్రజలలో విసుగు తెప్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో నిర్మితమవుతున్న బనకచర్ల ప్రాజెక్ట్‌పై బీఆర్‌ఎస్‌ నాయకులు స్వరం పెంచడం ఈ ప్రాంతీయ రాజకీయానికి తాజా ఉదాహరణ. ఈ వివాదం కేవలం నీటి వనరుల గురించి మాత్రమే కాకుండా, రాజకీయ లబ్ధి కోసం రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రయత్నంగా కనిపిస్తోంది.

లోకేశ్‌ మాటలను తనకు అనుకూలంగా మార్చుకుని..
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్ట్, గోదావరి నది నుంచి సుమారు 200 టీఎంసీ నీటిని రాయలసీమ ప్రాంతానికి తరలించే లక్ష్యంతో రూపొందించబడింది. ఈ ప్రాజెక్ట్‌కు కేంద్ర జల వనరుల సంఘం (సీడబ్ల్యూసీ)తో సహా బహుళ కేంద్ర సంస్థల నుంచి అనుమతులు లభించలేదని, తెలంగాణ హక్కులను కాలరాస్తోందని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, ఈ ప్రాజెక్ట్‌ను అడ్డుకోవడానికి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని, అవసరమైతే మరో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేష్‌ ఈ ప్రాజెక్ట్‌ గోదావరి మిగులు జలాల కోసం మాత్రమే అని స్పష్టం చేశారు. కానీ హరీశ్‌రావు వీటిని తనకు అనుకూలంగా మార్చుకుని తెలంగాణ వాదం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నారా లోకేష్‌ వ్యాఖ్యలను ఖండిస్తూ, బనకచర్ల ప్రాజెక్ట్‌కు అనుమతులు లేని విషయాన్ని ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి లోకేష్‌ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు, ఈ ప్రాజెక్ట్‌కు అన్ని అనుమతులు సాధించినట్లు వాదించారు.

Also Read: మహువా…. పార్లమెంట్ ను మళ్లీ దడదడలాడించేసింది!

అదే సమయంలో, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా కేంద్రానికి ఏడు లేఖలు రాశారని ఆరోపించారు. ఈ విమర్శలు బీఆర్‌ఎస్‌ రాజకీయ వ్యూహంలో భాగంగా, తెలంగాణ ప్రజలలో ఆంధ్రప్రదేశ్‌పై అసంతృప్తిని రేకెత్తించే ప్రయత్నంగా కనిపిస్తాయి. కేవలం కేసీఆర్, కేటీఆర్‌ను సంతృప్తి పర్చేందుకు.. లేదంటే ఏపీలోని కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ)ని సంతృప్తిపర్చేందుకు ఇలా మాట్లాడి ఉంటారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డికి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశ్యం ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version