Telangana Police: పోలీసుల తీరుపై విమర్శలు సహజమే. ఎప్పుడు ఏదో ఒక విషయంలో వారు వివాదాల్లో ఉంటూనే ఉంటారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వారి విషయంలో పలుమార్లు ఎన్నో రకాలుగా రావడం తెలిసిందే. పోలీసులు రాజకీయ నాయకుల చేతిబొమ్మలుగా మారిపోయారనేది మరో వాదన. ఏ రాష్ట్రంలో తీసుకున్నా వారి ప్రవర్తన అలాగే ఉంటుందనేది పలువురి వాదన. దీంతో ప్రజలకు రక్షణ విషయం పక్కన పెట్టి మిగతా విషయాల్లో మాత్రం ముందుండటం తెలిసిందే.

తాజాగా వరంగల్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ సంఘటన ఇదే విషయాన్ని రుజువు చేస్తోంది. సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు తీర్చాల్సిన వారే వారికి ఇబ్బందులు సృష్టించడం విమర్శలకు తావిస్తోంది. హన్మకొండలో జరిగిన ఈ ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. వారితో వాగ్వాదానికి దిగిన తీరు అందరిలో ఆగ్రహం కలిగేలా చేసింది. దీనిపై అన్నా చెల్లెళ్లు అని చూడకుండా వారిని నానా దుర్భాషలాడటంతో వారు పోలీసులను ప్రశ్నించారు.
సాధారణ పౌరులకు ఇబ్బందులు కలిగించడమే పోలీసుల విధి నిర్వహణా అని సూటిగా అడిగారు. అయినా వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. అతడి చొక్కా పట్టుకుని లాగడంతో అతడి చెల్లి వారిని ఎడాపెడా కడిగేసింది. మగాళ్లను పోలీసులు పట్టుకోవచ్చు కానీ ఆడదాన్ని అయిన నాపై ఎలా చేతులు వేస్తారని గట్టిగా గద్దించింది. దీంతో నడిరోడ్డుపై గలాటా కలిగింది. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పోలీసుల తీరుపై పెను విమర్శలు వస్తున్నాయి.
బానోతు అనూష, రాజ్ కుమార్ అనే అన్నా చెల్లెళ్లు ద్విచక్ర వాహనంపై వస్తుంటే రాంగ్ రూట్ లో వచ్చారని వారిని పోలీసులు అడ్డుకుని గొడవకు దిగడంతో జనం పోగయ్యారు. పోలీసుల తీరుపై వారు ఎన్నో రకాలుగా ప్రశ్నించినా పోలీసులు మాత్రం వారి నైజాన్ని ప్రదర్శించడం తెలిసిందే. కాకతీయ యూనివర్సిటీ పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. పౌరులకు ఇబ్బందులు కలిగించే విధంగా నానా గొడవలు చేయడమేమిటని అందరు అడుగుతున్నారు.