Telangana new liquor policy: మద్యం వినియోగంలో తెలంగాణ రాష్ట్రం టాప్ టెన్ లిస్ట్ లో ఉంది. ఒకరకంగా ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయాన్ని ఇచ్చేది మద్యం వ్యాపారమే అని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే గ్రామాలు, పట్టణాల్లో అత్యధిక వైన్ షాపులు అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు కోట్ల మంది మద్యం సేవిస్తున్న వారు ఉన్నారు. మద్యం సేవించడం అనారోగ్యమే అయినా.. ఒత్తిడి నుంచి తట్టుకోవడానికి మద్యం చాలా అవసరం అని కొంతమంది భావిస్తున్నారు. దీంతో ఓవరాల్ గా మద్యం అమ్మకాలు పెరుగుతూ ఉంటాయి. మద్యం ధరలు అధికంగా ఉన్నా.. మద్యం కొనుగోళ్లపై ఇలాంటి ప్రభావం ఉండదని చెప్పవచ్చు. అయితే ఈమధ్యం అమ్మకాలను మరింతగా పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో రాష్ట్రంలో మైక్రో బ్రూవరీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. అసలు మైక్రో బ్రూవరీలు అంటే ఏమిటి?
Also Read: అందరి దృష్టి బీసీ రిజర్వేషన్లపైనే..
సాధారణంగా బ్రూవరీ అంటే బీర్ ను ఉత్పత్తి చేసే సంస్థ. పెద్దపెద్ద కంపెనీలు పెద్ద మొత్తంలో బీర్లను తయారు చేస్తూ ఉంటాయి. ఇవి కొన్నిచోట్ల మాత్రమే ఉంటాయి. అయితే బ్రూవరీలు కొన్ని రకాలుగా ఉంటాయి. వీటిలో కాంట్రాక్టు బ్రూవరీలు, మైక్రో బ్రూవరీలు అనేవి ఉంటాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం మైక్రోబ్రూవరీలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. మైక్రో బ్రూవరీలు కూడా బీర్లను ఉత్పత్తి చేస్తాయి. ముడి సరుకులను తీసుకొచ్చి అప్పటికప్పుడు బీర్ ను అందిస్తాయి. అయితే ఇవి పెద్ద బ్రూవరీల వలే కాకుండా చిన్న మొత్తంలో ఉత్పత్తి చేస్తాయి. ఆ రోజుకు ఎంత అవసరమో అంతే తయారు చేస్తాయి. దీంతో ఫ్రెష్ గా తయారైన బీర్ ను పొందవచ్చు. ఇప్పటికే వైన్ షాపుల్లో బీర్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వేసవికాలంలో అయితే ఇవి మరింత ఎక్కువగా ఉంటాయి. కానీ చాలామంది కేవలం ఒకటి లేదా రెండు గ్లాసుల బీరు మాత్రమే కావాలని కోరుకుంటారు. ఇలాంటివారు 750 ml బీర్ ను కొనుగోలు చేయడానికి ఇష్టపడరు. అంతేకాకుండా బ్రూవరీలలో తయారయ్యే బీరును నేరుగా తీసుకోవడం వల్ల రుచిగా ఉంటుందని కొందరి భావన. వీటి ఏర్పాటు వల్ల అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read: కేటీఆర్, హరీష్ రావు ఏకతాటి మీదికి వచ్చారంటే.. అది కవిత పుణ్యమే!
ప్రభుత్వం తెలుపుతున్న ప్రకారం.. నగరంలో 5 కిలోమీటర్ల కు ఒక బ్రూవరీ.. పట్టణాల్లో 30 కిలోమీటర్లకు ఒక బ్రూవరీ ఏర్పాటు చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే సాంప్రదాయంగా వైన్ షాప్ లో కొనుగోలు చేసి బీర్ తాగేవారు ఈ బ్రూవరీలకు ఏ విధంగా అలవాటు పడిపోతారో చూడాల్సి ఉంది. అంతేకాకుండా వీటివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే చాలామంది మద్యం తాగడం వల్ల ఎన్నో రకాలుగా అనారోగ్యాలకు గురవుతున్నారని చెబుతున్నారు. సరదా కోసం అయినా ప్రతిరోజు మద్యం తాగితే శరీరంపై ప్రభావం చూపుతోందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇవి ఎంతవరకు లాభాలను తీసుకొస్తాయో చూడాలి.