Mahavatar Narsimha Movie: సినిమా ఇండస్ట్రీలో పెను మార్పులైతే వచ్చాయి. మంచి కంటెంట్ తో సినిమా వస్తే ఆ మూవీ సూపర్ డూపర్ సక్సెస్ సాధిస్తోందని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి అయితే లేదు. ఎందుకంటే స్టార్ కస్టింగ్ ఏం లేకపోయినా కంటెంట్ బాగుండటం వల్ల సినిమాలు వచ్చి మంచి విజయం సాధించిన సందర్భాల్లో చాలానే ఉన్నాయి. ప్రస్తుతం ‘మహావతార్ నరసింహ’ అనే సినిమా కూడా ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తుంది. ఈనెల 24వ తేదీన ‘హరిహర వీరమల్లు’ సినిమాతో పవన్ కళ్యాణ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాని చూడడానికి పెద్దగా ఆసక్తి అయితే చూపించడం లేదు. మహావతార్ నరసింహ సినిమా రిలీజ్ అయింది. యానిమేషన్ సినిమాగా వచ్చిన ఈ మూవీ ప్రహ్లాదుడు, నరసింహ స్వామి జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. కాబట్టి ఈ సినిమా మైథాలజికల్ గా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. దాంతో మొదటి రోజు కోటి 70 లక్షల కలెక్షన్స్ ను మాత్రమే రాబట్టింది.
Also Read: రాజా సాబ్’ నుండి వణుకుపుట్టించే పోస్టర్ విడుదల..ఏమి ప్లాన్ చేశారు సామీ!
ఈ సినిమా మొత్తం నాలుగు రోజులకు కలిపి 22 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. గ్రాస్ కలెక్షన్స్ విషయానికి వస్తే 30 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టడం విశేషం…తెలుగులో అల్లు అరవింద్ కొనుగోలు చేసి ఆయనే ఓన్ గా రిలీజ్ చేశాడు. ఆయన పంట పండింది భారీ కలెక్షన్స్ ను కొల్లగొడుతుంది.
బుక్ మై షో లో ప్రతి గంటకు 10,000 టికెట్లకు పైన అమ్ముడుపోతున్నాయి. ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది అంటూ చాలామంది చెప్తున్నారు. ఫ్యామిలీ మొత్తం కలిసి చూడదగ్గ సినిమాగా ఈ సినిమాని మలచడంతో చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే పిల్లల్ని తీసుకొని పెద్దవాళ్లు సైతం సినిమా థియేటర్ కి వచ్చి ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయడం విశేషం… మొత్తానికైతే అల్లు అర్జున్ మరోసారి బిజినెస్ లో దూసుకుపోతున్నాడనే చెప్పాలి.
Also Read: ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ పవన్ కళ్యాణ్ క్రేజీ లుక్ అదిరింది!
స్ట్రెయిట్ సినిమాలు ఏమీ చేయకుండా ఒక సినిమాను కొనుగోలు చేసి కూడా బాగా డబ్బులు సంపాదించడంలో అల్లు అరవింద్ దిట్ట. తను మరోసారి తన బిజినెస్ స్ట్రాటజీని వాడి హిట్ కొడుతుండడం నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి…చూడాలి మరి రాబోయే సినిమాలతో అల్లు అరవింద్ ఎలాంటి సక్సెస్ లను నిర్మిస్తాడు? ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది…
