HomeతెలంగాణTelangana Maharashtra Border: ఏంటీ అరాచకం.. తెలంగాణ గ్రామాలు లాగేసుకుంటారా?

Telangana Maharashtra Border: ఏంటీ అరాచకం.. తెలంగాణ గ్రామాలు లాగేసుకుంటారా?

Telangana Maharashtra Border: నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో దాదాపు 13 ఏళ్లు పోరాడిన తెలంగాణ సమాజం చివరకు 2014లో ప్రత్యేక రాష్ట్రం సాధించుకుంది. రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు గ్రామాలను ఏపీలో కలిపేశారు. 11 ఏళ్లు గడిచినా ఆ ఏడు గ్రామాల ప్రజలు ఇప్పటికీ తమను తెలంగాణలో విలీనం చేయాలని కోరుతున్నారు. తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఇందుకోసం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు అధికారం పోగానే మళ్లీ ఏడు గ్రామాలను తెలంగాణలో కలపాలని కోరుతోంది. ఇక ఇప్పుడు మరో 14 గ్రామాలను లాక్కునేందుకు మహారాష్ట్రలోని బీజేపీ సర్కార్‌ పావులు కదుపుతోంది.

14 గ్రామాలు ఇవే..
తెలంగాణలోని రజురా, జివాటి తాలూకాల్లో ఉన్న 14 గ్రామాలను మహారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లాలో విలీనం చేసే ప్రక్రియను మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్‌ బవన్కులే ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ గ్రామాలు దీర్ఘకాలంగా సరిహద్దు వివాదంలో ఉన్నాయి. ఈ నిర్ణయం ఈ సమస్యను పరిష్కరించడంలో కీలకమైన అడుగుగా భావిస్తున్నారు. ఈ 14 గ్రామాల ప్రజలు తమను ఎప్పటి నుంచో మహారాష్ట్రలో విలీనం చేయాలని కోరుతున్నారట. జమాబందీ రికార్డుల ప్రకారం, ఈ గ్రామాలు మహారాష్ట్ర భూభాగంలోనే ఉన్నట్లు చూపుతున్నాయని మహారాష్ట్ర మంత్రి బవన్కులే తెలిపారు. ఈ గ్రామాలు ప్రస్తుతం తెలంగాణ, మహారాష్ట్ర రెండు రాష్ట్రాల ఓటరు జాబితాలో ఉన్నాయి. దీని వల్ల గ్రామస్తులు రెండు రాష్ట్రాల నుంచి ప్రయోజనాలు పొందుతున్నారు.

Also Read: Revanth Reddy Strategy: సీఎం రేవంత్ రెడ్డి ఎలా ఎదుర్కొంటున్నారు..

చారిత్రక నేపథ్యం..
ఈ గ్రామాలు 1956 నుంచి మహారాష్ట్ర, తెలంగాణ (గతంలో ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా) మధ్య 80 చదరపు కిలోమీటర్ల వివాదాస్పద భూభాగంలో ఉన్నాయి. ఈ సమస్య సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది, కానీ గ్రామస్తులు రెండు రాష్ట్రాల నుంచి∙ప్రయోజనాలు పొందుతూ రెండు రాష్ట్రాల గుర్తింపును కలిగి ఉన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఈ విలీన నిర్ణయాన్ని సమర్థించారు. ఇది దీర్ఘకాల సమస్యకు పరిష్కారం కాగలదని భావిస్తున్నారు.

ఈ గ్రామాల్లోని జనాభా ప్రధానంగా మరాఠీ మాట్లాడే ఎస్సీ సామాజిక వర్గాలవారు. 1970–71 నుంచి మహారాష్ట్రలోని నాందేడ్, పర్భణీ, జల్నా జిల్లాల నుంచి వలస వచ్చిన కొంతమంది ముస్లింలు ఉన్నారు. ఈ విలీనం వారి అడ్మినిస్ట్రేటివ్‌ సమస్యలను పరిష్కరించి, భూమి హక్కులను స్థిరీకరించడంతోపాటు రాజకీయ, ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురావాలని మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే తెలంగాణ ప్రజలు మాత్రం కేంద్రంలో, మహారాష్ట్రలో అధికారంలో ఉన్నామని మా గ్రామాలను లాక్కుంటారా.. ఏమిటీ అరాచకం అని ప్రశ్నిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular