Telangana Liquar Brands
Telangana Liquor: తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు(New Liquar Brands)ప్రవేశపెట్టే ప్రక్రియ ఇటీవల కాలంలో వేగం పుంజుకుంది. 2025 మార్చి నాటికి, తెలంగాణ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TSBCL ) కొత్త బ్రాండ్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు కంపెనీల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. తాజా సమాచారం ప్రకారం, 37 కొత్త మద్యం బ్రాండ్లు మార్కెట్లోకి రానున్నాయని సమాచారం. ఈ కొత్త బ్రాండ్లలో విస్కీ, వోడ్కా, రమ్, బీర్ వంటి వివిధ రకాలు ఉండే అవకాశం ఉంది. అయితే ఖచ్చితమైన బ్రాండ్ పేర్లు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. గతంలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో విజయవంతంగా వ్యాపారం చేసిన కొన్ని లిక్కర్ కంపెనీలు ఇప్పుడు తెలంగాణలో తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. 2024లో రాష్ట్రంలో కొత్త బ్రాండ్ల పరిచయం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది, కానీ ఆర్థిక బకాయిలు (సుమారు రూ.3 వేల కోట్లు) కారణంగా కొన్ని ఆలస్యమయ్యాయి. ఇప్పుడు ఈ బకాయిల సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు పడుతున్నాయి, దీంతో కొత్త బ్రాండ్లకు అనుమతులు వేగంగా జారీ అవుతున్నాయి.
Also Read: మైక్రో రిటైర్మెంట్.. ఉద్యోగ విరమణలో కొత్త ఒరవడి..!
ప్రీమియం స్థాయి ఉత్పత్తులు..
తెలంగాణలో అందుబాటులోకి వచ్చే కొత్త బ్రాండ్లలో కొన్ని ప్రీమియం స్థాయి ఉత్పత్తులు కాగా, మరికొన్ని సాధారణ వినియోగదారులకు సరసమైన ధరల్లో అందుబాటులో ఉండేలా రూపొందించబడ్డాయి. TSBCL ప్రకారం, కంపెనీలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి, ధరల అనుమతి పొందిన తర్వాతే ఈ బ్రాండ్లు విక్రయానికి అందుబాటులోకి వస్తాయి. రాష్ట్రంలో మద్యం వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల కంపెనీలు ఈ మార్కెట్‌పై ఆసక్తి చూపుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1,000కి పైగా బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి, వీటిలో 30 బ్రాండ్లు ఎక్కువ ప్రజాదరణ పొందాయి.
కొత్త బ్రాండ్లకు ఆదరణ..
త్వరలో అందుబాటులోకి వచ్చే ఈ కొత్త బ్రాండ్ల పరిచయంతో మద్యం ప్రియులకు ఎక్కువ ఎంపికలు లభిస్తాయని. అదే సమయంలో ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుందని అంచనా. కచ్చితమైన బ్రాండ్ జాబితా. ధరల కోసం TSBCL అధికారిక వెబ్‌సైట్ (tsbcl.telangana.gov.in) ను సందర్శించడం లేదా స్థానిక లిక్కర్ షాపుల్లో విచారించడం మంచిది.