https://oktelugu.com/

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల..?

తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి షెడ్యూల్ ను విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ షెడ్యూల్ విడుదల కాగా మే నెల 1వ తేదీ నుంచి మే నెల 20వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతి సంవత్సరం మార్చి నెల తొలివారం నుంచి మూడవ వారం వరకు ఇంటర్ పరీక్షలు జరిగేవి. అయితే కరోనా విజృంభణ వల్ల ఈ ఏడాది రెండు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 28, 2021 / 06:39 PM IST
    Follow us on

    తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి షెడ్యూల్ ను విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ షెడ్యూల్ విడుదల కాగా మే నెల 1వ తేదీ నుంచి మే నెల 20వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతి సంవత్సరం మార్చి నెల తొలివారం నుంచి మూడవ వారం వరకు ఇంటర్ పరీక్షలు జరిగేవి. అయితే కరోనా విజృంభణ వల్ల ఈ ఏడాది రెండు నెలలు ఆలస్యంగా పరీక్షలు జరగనున్నాయి.

    ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఫస్టియర్ పరీక్షలు మే 1 నుంచి 19 వరకు సెకండియర్ పరీక్షలు మే 2 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఏప్రిల్ నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి వొకేషనల్ కోర్సులు చదివే విద్యార్థులకు కూడా ఇదే టైమ్ టేబుల్ వర్తిస్తుందని తెలిపారు.

    ఏప్రిల్ నెల 1వ తేదీన ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్‌ పరీక్ష జరగనుండగా ఏప్రిల్ నెల 3వ తేదీన ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్ష జరగనుందని సమాచారం. ఇంటర్ ఫస్ట్ షెడ్యూల్ విషయానికి వస్తే మే నెల 1వ తేదీన సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1, మే నెల 3వ తేదీన ఆంగ్లం పేపర్ 1, మే నెల 5వ తేదీన మ్యాథ్స్ పేపర్ 1ఏ, బోటనీ పేపర్ 1, సివిక్స్ పేపర్ 1, సైకాలజీ పేపర్ 1, మే 7వ తేదీన మ్యాథ్స్ పేపర్ 1బీ, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలు జరగనున్నాయి.

    మే నెల 10వ తేదీన ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1, క్లాసికల్ లాంగ్వేజ్ పేపర్ 1, మే నెల 12వ తేదీన కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1, సోషియాలజీ పేపర్ 1, మ్యూజిక్ పేపర్, ఫైన్ ఆర్ట్స్ 1 17వ తేదీన జియాలజీ, హోం సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ పేపర్, లాజిక్ పేపర్, బ్రిడ్జ్ కోర్స్ గణితం పేపర్ 1 పరీక్షలు జరగనున్నాయి. మే 19వ తేదీన మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జాగ్రఫీ పేపర్ 1 పరీక్షలు జరగనున్నాయి.