Telangana Government :  తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మూడు నెలల పాటు ఇంటర్నెట్ ఫ్రీ..

హైదరాబాద్ తో పాటు మారుమూల గ్రామాల్లోనూ ఇంటర్నెట్ వాడకం పెరిగింది. నిత్యావసరాల్లో భాగంగా ఇంటర్నెట్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలకు తక్కువ ధరకే ఇంటర్నెట్ సదుపాయం అందించేందుకు కసరత్తు ప్రారంభించింది. అయితే ఈ ఇంటర్నెట్ సేవలను టీ ఫైబర్ గ్రిడ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో కొనసాగిస్తారు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 11, 2024 11:12 am

Telangana Government

Follow us on

Telangana Government :   ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఇంటర్నెట్ అవసరం ఉంటుంది. మొబైల్ నుంచి టీవీ వరకు ఇంటర్నెట్ పైనే ఆధారపడుతున్నారు. అయితే మిడిల్ క్లాస్ పీపుల్స్ కు ఇది భారంగా మారింది. నెలనెలా కనీసం రూ. వెయ్యి నుంచి రూ. 2వేల వరకు వీటి బిల్లులే చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇంటింటికి తక్కువ ధరకే ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించే ప్రయత్నం చేస్తుంది. అయితే ముందుగా ఫైలట్ ప్రాజెక్టుగా కొన్ని గ్రామాలను ఎంపిక చేసిన తరువాత మూడు నెలల అనంతరం తక్కువ ధరకే ఇంటర్నెట్ అందించనున్నారు. ఈ మూడు నెలలు మాత్రం ఉచితంగా ఇంటర్నెట్ సదుపాయం కల్పించనున్నారు. అయితే ఆ ఫైలట్ ప్రాజెక్టుకు ఎన్ని గ్రామాలను ఎంపిక చేయనున్నారంటే?

హైదరాబాద్ తో పాటు మారుమూల గ్రామాల్లోనూ ఇంటర్నెట్ వాడకం పెరిగింది. నిత్యావసరాల్లో భాగంగా ఇంటర్నెట్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలకు తక్కువ ధరకే ఇంటర్నెట్ సదుపాయం అందించేందుకు కసరత్తు ప్రారంభించింది. అయితే ఈ ఇంటర్నెట్ సేవలను టీ ఫైబర్ గ్రిడ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో కొనసాగిస్తారు. ఇందులో భాగంగా ఫైలట్ ప్రాజెక్టుగా తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ కొన్ని రోజుల కిందే టెండర్లను ఆహ్వానించింది. బిడ్ దాఖలు చేసిన కంపెనీలు వచ్చే 13న ప్రజంటేషన్ ఇవ్వనున్నాయి.

అయితే ఫైలట్ ప్రాజెక్టుగా తెలంగాణలోని జిల్లాలను జోన్లుగా విభజించనున్నారు. మొత్తం జిల్లాలను 10 జోన్లుగా ఏర్పాటు చేసిన ఇంటర్నెట్ అందించనున్నారు. ఇలా మూడు నెలల పాటు ఉచితంగా ఇంటర్నెట్ సేవలు అందిస్తారు. ఈ ఇంటర్నెట్ ద్వారా మొబైల్ సేవలతో పాటు కేబుల్ ప్రసారాలకు కూడా ఉపయోగపడనుంది. 20 ఎంబీపీఎస్ స్పీడ్ తో 500 జీబీ వరకు స్పీడ్ ఇంటర్నెట్ అందించాలి. ఈ కాంట్రాక్ట్ ను దక్కించుకున్న సంస్తలు ఇంటర్నెట్ తో హెడీ టీవీ ఛానెళ్లను అందించే విధంగా ఏర్పాటు చేయాలి. ఎంటర్టైన్మెంట్ ఛానెళ్లు మాత్రమే కాకుండా ప్రభుత్వం ప్రసారం చేసే టీ శాట్ వంటి ఛానెళ్లను కూడా ఇందులో చేర్చాలి. ప్రతీ గ్రామంలో ఇంటర్నెట్ వచ్చాక వీడియో కాన్పరెన్స్ కు ఉపయోగ పడే విధంగా 23 డిస్ప్లేలను ఏర్పాటు చేస్తారు. ముందుగా శాంపిల్ గా 5 గ్రామాలు ఎంపిక చేసి పరిశీలిస్తారు.

ఇలా మూడు నెలల పాటు ఉచితంగా అందించిన సంస్థలు ఆ తరువాత తక్కువ మొత్తంలో చార్జీలు వసూలు చేసుకోవాలి. అయితే ఎంత అనేది ఇప్పుడే అధికారికంగా నిర్ణయించలేదు. కానీ రూ. 300 అని ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఈ ఇంటర్నెట్ సేవలు 93 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో వచ్చే ఈ ఇంటర్నెట్ ద్వారా చాలా మందికి బిల్లులు ఆదా అయ్యే అవకాశం ఉంది.

మొత్తంమీద రాష్ట్ర వ్యాప్తంగా హైస్పీడ్ ఇంటర్నెట్ తక్కువ ధరకే అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే ఈనెల 13న కాంట్రాక్ట్ సంస్థల ప్రజంటేషన్ తరువాత ఎలాంటి నిర్ణయాలు ఉంటాయోనని ఆసక్తిగ ఎదురుచూస్తున్నారు. అప్పుడే మూడు నెలల పాటు ఉచితంగా ఇంటర్నెట్ సదుపాయం ఎలా కల్పిస్తారో వివరించనున్నారు.