HomeతెలంగాణDEET APP : కొత్త ఏడాదిలో నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. అందుబాటులోకి డీట్‌ యాప్‌..

DEET APP : కొత్త ఏడాదిలో నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. అందుబాటులోకి డీట్‌ యాప్‌..

DEET APP :  తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల భర్తీ వేగం పుంజుకుంది. తాము ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ఏడాదిలో 55 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ సమస్య పరిష్కారాన్ని వేగవంతం చేయాలని రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రైవేటు కొలువులపై దృష్టిపెట్టారు. ప్రభుత్వం మధ్యవర్తిత్వంలో ప్రైవేటు సంస్థల్లోనూ అర్హులకు ఉద్యోగాలు ఇచ్చేలా డీఈఈటీ(డీట్‌)యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్‌ ఏఐ(Artificial Intelligence) ఆధారంగా పనిచేస్తుంది. పరిశ్రమలకు, నిరుద్యోగులకు వారధిగా పనిచేస్తుంది. నిరుద్యోగులకు ఉన్న నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగ అవకాశాలు ఈ డిజిటల్‌ ప్లాట్‌పాం కల్పిస్తుంది. రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పర్చడమే లక్ష్యంగా దీనిని ప్రభుత్వం రూపొందించింది. దీంతో రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ప్రైవేటు సంస్థలో నిరంతరం ఉద్యోగాల కల్పనకు ఈ డీట్‌ యాప్‌ పనిచేస్తుంది.

అన్నీ ఒకేచోట..
ఈ యాప్‌లో ఉద్యోగ సమచారంతోపాటు స్కిల్‌ ప్రోగ్రామ్‌లతోపాటు అన్నీ ఒకేచోట లభించేలా డిజిటల్‌ ప్లాట్‌ఫాం అందుబాటులోకి తెచ్చారు. ప్రత్యేక యాప్‌ను రూపొందించిన ప్రభుత్వం వివిధ కంపెనీలు కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాలను అలాగే అప్రెంటిస్‌షిప్, ఇంటర్న్‌షిప్‌ తదితర వివరాలను ఈ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అందుబాటులోకి తెస్తుంది. వివిధ అవసరాలకు తగినట్లుగా కంపెనీలు రిక్రూట్‌మెంట్‌ చేసుకుంటాయి.

అందుబాటులో మరిన్ని వివరాలు
నిరుద్యోగులతోపాటు పైనల్‌ ఇయర్‌లో ఉన్న విద్యార్థులు తమ పూర్తి వివరాలను ఇందులో నమోదు చేసుకోవడం ద్వారా సులభంగా ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. వివరాలు నమోదుచేసుకున్న అభ్యర్థులకు కంపెనీలు తమ అవరసాలకు తగిన ఉపాధి అవకాశాలకు సంబంధించిన మెస్సేజ్‌లు, మెయిల్స్‌ పంపించడంతోపాటు కాల్స్‌ కూడా చేసి ఇంటర్వ్యూలు(Interviews)నిర్వహిస్తాయి. ఈ యాప్‌ ద్వారా ఉద్యోగాలు కోరుకునేవారికి మాత్రమే కాకుండా ఉద్యోగాలు ఇచ్చేవారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మెరుగైన స్కిల్స్‌ ఉన్నవారిని ఎంపిక చేసుకోవడానికి కంపెనీలకు వెసులుబాటు కలిగింది.

ప్లే స్టోర్లో అందుబాటులో యాప్‌..
డీట్‌ యాప్‌ ప్రస్తుతం ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది డీఈఈటీ పేరిట ఉంటుంది. దీనిని డౌన్‌లోడ్‌ చేసుకుని ఉద్యోగం కోసం సైన్‌ఇన్‌ అవ్వాల్సి ఉంటుంది. అందులో వారు అడిగిన ప్రొఫైల్‌ డేటాను పూర్తిచేసి దరఖాస్తులను సమర్పించాలి. యాప్‌లో లాగిన్‌ అయిన తర్వాత మీరు ఎలాంటి ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో చూడాలి.వీటితోపాటే నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు కూడా ఈ యాప్‌లో ఉంటాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular