GHMC property tax: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఇప్పటికే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. రూ.500 లకే సిలిండ్ అందరికీ అదండం లేదు. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల పెంపునకు కసరత్తు చేస్తోది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ వాసులకు శుభర్తా చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఆస్తిపన్ను బకాయిల వసూలుకు చారిత్రాత్మక వన్ టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేస్తూ, సామాన్యులపై వడ్డీ భారాన్ని 90% మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది.
కేవలం 10% వడ్డీ మాత్రమే..
బకాయి ఉన్న యజమానులు ప్రధాన మొత్తంతోపాటు వడ్డీలో కేవలం 10 శాతాన్ని చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన 90 శాతం వడ్డీ పూర్తిగా రాయితీ అవుతుంది. ఉదాహరణకు, రూ.10 వేల వడ్డీ ఉంటే రూ.1,000 మాత్రమే చెల్లించాలి. ఈ రాయితీ ఒక్కసారి చెల్లింపు వారికి మాత్రమే వర్తిస్తుంది. నివాస, వాణిజ్య ఆస్తుల యజమానులంతా అర్హులు.
సులభంగా చెల్లింపు..
పన్ను చెల్లింపులు ఆన్‌లైన్ పోర్టల్, మీ–సేవా కేంద్రాలు లేదా సర్కిల్ కార్యాలయాల ద్వారా సాధ్యం. ఆన్‌లైన్‌లో స్వయంచాలకంగా 90% వడ్డీ తగ్గింపు వర్తిస్తుంది. నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా తక్షణ లావాదేవీలు పూర్తి చేయవచ్చు. ఈ సౌలభ్యం లక్షలాది మందికి ఆర్థిక సౌకర్యం కల్పిస్తుంది.
కోవిడ్ తర్వాత ఆర్థిక సంక్షోభాలతో పన్నుల చెల్లింపు వాయిదా వేసినవారికి ఇది గొప్ప అవకాశం. ప్రభుత్వం బకాయిలు వసూలు చేసుకుంటూ పౌరులకు భారం తగ్గిస్తోంది. ఈ పథకం జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని ఆస్తులకు వర్తిస్తుంది. దీంతో వేల మందికి దీంతో లబ్ధి కలుగనుంది.