Junior NTR- KCR
KCR -JrNTR : డబ్బు ఊరకనే రాదు.. ఇటీవల బహుళ ప్రాచుర్యం పొందిన అడ్వటయిజ్ మెంట్ లోని ఓ వ్యాఖ్య ఇది.
ఇది తెలంగాణ సీఎం కేసీఆర్ కు అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. ఆయన ఏ చర్య చేపట్టినా.. దాని వెనక ఒక పుణ్యం, పురుషార్థం ఒకటి ఉంటుంది. అందుకే ఆయన అపర చాణుక్యుడిగా పేరొందారు. బీజేపీ హైకమాండ్ నేతలే ఆయన విషయంలో కాస్తా తగ్గినట్టు కనిపిస్తున్నారు. అయితే ఆయన తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పై కాన్సంట్రేట్ చేయడం చర్చనీయాంశమైంది. కొద్ది నెలల కిందట బీజేపీనేత అమిత్ షా జూనియర్ ను పిలిపించుకొని మాట్లాడారు. ఇప్పుడు కేసీఆర్ కేబినెట్ లోని పువ్వాడ అజయ్ వెళ్లి కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పైకి ఏమీ లేదని చెబుతున్నా.. పక్కా ప్లాన్ ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది.
ప్రత్యేక ఆహ్వానం…
ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ ఆధ్వర్యంలో 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఇందుకుగాను రూ.4 కోట్లు ఖర్చు చేశారు. ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పై శ్రీకృష్ణుడు వేషధారణలో ఏర్పాటుచేసిన ఈ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ నెల 28న ఎన్టీఆర్ శత జయంతి వేడుకల నాడు విగ్రహ ఆవిష్కరణకు ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా మంత్రి అజయ్ ఆహ్వానించారు. ఇది రాజకీయంగా సెగలు రేపుతోంది. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు తారక్ కు ఆహ్వానం లేదని ప్రచారం జరుగుతున్న వేళ.. ఏకంగా ఎన్టీఆర్ భారీ విగ్రహావిష్కరణకు తెలంగాణ మంత్రి ఆహ్వానించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
కమ్మ ఓట్లపై…
తెలంగాణలో ఇప్పటికీ టీడీపీకి కేడర్ ఉంది. నాయకత్వం మాత్రం చెల్లాచెదురైంది.ఇప్పుడు గాడిలో పెట్టే పనిలో పడ్డారు చంద్రబాబు. జవసత్వాలు నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ బీఆర్ఎస్ కు ముచ్చెమటలు పెడుతోంది. అందుకే కేసీఆర్ ఏ చిన్న అవకాశాన్ని జారవిడుచుకోవడం లేదు. ముఖ్యంగా ఖమ్మంతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే కమ్మ సామాజికవర్గంపై దృష్టిపెట్టారు. అందులో భాగంగానే ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటుచేయించారు. మంత్రి పువ్వాడ విజయ్ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ ను పిలిచి ఆవిష్కరించాలన్న ప్లాన్ తో ఉన్నారు. తద్వారా కమ్మ సామాజికవర్గాన్ని ఆకర్షించడమే కేసీఆర్ ముఖ్య ఉద్దేశ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కేసీఆర్ దోస్తీకి జూనియర్ ఎంతవరకు మొగ్గుచూపుతారన్నదే ఇప్పుడు ప్రశ్న.
టీడీపీ వైపు చూపు..
మరోవైపు టీఆర్ఎస్ నేతలు అకస్మాత్తుగా ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించి నివాళులు అర్పించడం.. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేయడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టీఆర్ఎస్ బాస్ కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తోన్న సంగతి తెలిసిందే. దసరా తర్వాత ఆయన దేశ రాజకీయాలపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టే అవకాశాలున్నాయి. ఇటీవలే ఆయన అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, కుమారస్వామి, దేవేగౌడ లాంటి నేతలను కలిశారు.జాతీయ స్థాయి రాజకీయాలపై భారీ ఆశలు పెట్టుకున్న కేసీఆర్.. టీడీపీ నుంచి మద్దతు రాబట్టడం కోసమే తమ పార్టీ నేతలను ఎన్టీఆర్ ఘాట్‌కు పంపారని భావన వ్యక్తం అవుతోంది. అదే సమయంలో అవసరమైతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ మద్దతును పరోక్షంగానైనా టీఆర్ఎస్ కోరే అవకాశాలూ లేకపోలేదు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Telangana government has invited junior ntr to unveil ntrs idol in khammam district
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com