Homeక్రీడలుKL Rahul Injury: కీలక టోర్నీ ముందు.. టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బలు

KL Rahul Injury: కీలక టోర్నీ ముందు.. టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బలు

KL Rahul: టీమిండియాను గాయాల బెడత వేధిస్తోంది. ఐపీఎల్ తర్వాత కీలక టోర్నీల్లో భారత్ ఆడనుంది. అటువంటి తరుణంలో జట్టులో కీలక ప్లేయర్లుగా పేరుగాంచిన వాళ్లు గాయాలు కారణంగా జట్టుకు దూరమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే గాయం వల్ల కీలక టోర్నీలకు దూరమయ్యాడు బుమ్రా. ఈ జాబితాలో రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ ఉండగా, తాజాగా కేఎల్ రాహుల్ కూడా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇది టీమిండియాకు గట్టి దెబ్బాగానే భావించాలి.

టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ కొద్దిరోజుల కిందట జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో గాయపడ్డాడు. గాయం కారణంగా ఆ తరువాత నుంచి జరుగుతున్న లక్నో మ్యాచ్ లకు రాహుల్ దూరం అయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఈ సీజన్ లో తదుపరి జరగాల్సిన లక్నో జట్టు మ్యాచ్ లకు పూర్తిగా దూరం అయ్యాడు రాహుల్. ఇది ఆ జట్టుకు గట్టి దెబ్బగానే భావించాలి. లక్నో తదుపరి ఆడాల్సిన అన్ని మ్యాచ్ ల్లో గెలిస్తేనే తదుపరి దశకు వెళ్లే అవకాశం ఉంది. అయితే, రాహుల్ జట్టు నుంచి దూరం కావడంతో జట్టుపై తీవ్ర ప్రభావం ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

వచ్చే నెల 7 నుంచి డబ్ల్యుటిసి ఫైనల్..

ఐపీఎల్ ముగిసిన వెంటనే టీమిండియా పలు కీలక టోర్నీలు ఆడనుంది. ముఖ్యంగా జూన్ 7వ తేదీ నుంచి డబ్ల్యుటిసి ఫైనల్ మ్యాచ్ ను ఆస్ట్రేలియా జట్టుతో భారత్ ఆడనుంది. ఈ మ్యాచ్ అత్యంత కీలకము కావడంతో సీనియర్ ప్లేయర్లను ఎంపిక చేయాలని బీసీసీఐ భావించింది. అయితే వరుసగా కీలక ప్లేయర్లు గాయాల బారిన పడడంతో జట్టుకు ఇబ్బందికరమైన పరిణామంగా మారింది. ఇప్పటికే టెస్ట్ జట్టులో ప్లేయర్ గా ఉన్నటువంటి రిషబ్ పంత్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకుంటున్నాడు. ఈ మ్యాచ్ కు పంత్ కూడా దూరమయ్యాడు. టెస్టు జట్టులో సభ్యుడిగా ఉన్న పంత్ గత కొన్నాళ్ల నుంచి అద్భుతంగా రాణిస్తున్నాడు. కీలక ప్లేయర్లు చేతులెత్తేసిన దశలో కూడా పంత్ అద్భుత బ్యాటింగ్ తో జట్టు విజయం సాధించడంలో కీలకంగా మారాడు. అటువంటి పంత్ కీలక మ్యాచ్ కు దూరం కావడం జట్టుకు ఇబ్బందికరమైన అంశంగానే భావించాలి. టెస్టు, వన్డే, టి20 మ్యాచ్ ఏదైనా అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలకంగా మారాడు బుమ్రా. అటువంటి బుమ్రా కూడా గాయం కారణంగా కొన్నాళ్ల నుంచి క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. ఇది కూడా టెస్టు మ్యాచ్ పై ప్రభావం చూపించనుంది. శ్రేయాస్ అయ్యర్ కూడా ఐపీఎల్ మ్యాచ్ ఆడుతూ గాయపడ్డాడు. వన్డే జట్టులో కీలక ప్లేయర్ అయిన అయ్యర్ గాయం వల్ల తదుపరి వన్డే మ్యాచ్ ల్లో ఆడలేని పరిస్థితి. మిడిలార్దర్ జట్టుకు బలమైన ఇన్నింగ్స్ నిర్మించడంలో అయ్యర్ సమర్థుడు. అటువంటి అయ్యర్ రానున్న టోర్నీలకు దూరం కావడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది.

ఇంకెంత మంది గాయాల బారిన పడతారో..

ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ లో టీమిండియా జట్టుకు ఆడుతున్న పలువురు కీలక ప్లేయర్లు గాయాల బారిన పడ్డారు. ఒక్కో జట్టు మరో ఐదేసి మ్యాచ్ లు ఐపీఎల్ లో ఇంకా అడాల్సి ఉంది. ఈ తరుణంలో ఇంకెంత మంది గాయాల బారిన పడతారో అన్న ఆందోళన అందరిలోనూ ఉంది. ముఖ్యంగా ముంబై జట్టుకు ఆడుతున్న కెప్టన్ రోహిత్ శర్మ, బెంగుళూరు జట్టుకు ఆడుతున్న విరాట్ కోహ్లీ, గుజరాత్ కు ఆడుతున్న హార్దిక్ పాండ్య, షమీతోపాటు మిగిలిన జట్లకు ఆడుతున్న కీలక ప్లేయర్లు ఐపీఎల్ లోని మిగిలిన మ్యాచ్ లను జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. వీరిలో ఎవరు గాయాలు బారినపడినా జట్టుకు ఇబ్బందులు తప్పవని, కీలక టోర్నీలను కోల్పోవాల్సి వస్తుందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular