Shivaratri : శివరాత్రికి స్పెషల్ మిడ్ నైట్ షోస్ వేయడం దశాబ్దాల నుండి మన తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితీగా వస్తూ ఉంది. శివ నామస్మరణ చేసుకుంటూ, జాగరణ చేసేవారికి కాలక్షేపం గా ఉంటాయి ఈ సినిమాలు. ఈ ఏడాది కూడా శివరాత్రికి స్టార్ హీరోల పాత సినిమాలను పలు ముఖ్యమైన సిటీస్ లో పెద్ద ఎత్తున ప్లాన్ చేసారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలు పెట్టారు. హౌస్ ఫుల్స్ కూడా అయ్యాయి. కానీ ఈ విషయం తెలంగాణ ప్రభుత్వానికి తెలియడంతో వెంటనే శివ రాత్రి స్పెషల్ షోస్ ని రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసారు. దీంతో హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో గ్రాండ్ గా ప్లాన్ చేసిన గుంటూరు కారం(Guntur Karam), దేవర(Devara Movie), రెబల్ మిడ్ నైట్ షోస్ క్యాన్సిల్ అయ్యాయి. ఇలా క్యాన్సిల్ అవ్వడానికి ముఖ్య కారణం పుష్ప ఎఫెక్ట్ అని స్పష్టంగా అర్థం అవుతుంది.
ఎప్పుడైతే పుష్ప 2(Pushpa 2 Movie) ప్రీమియర్ షో తొక్కిసలాట లో రేవతి అనే మహిళా మృతి చెందిందో, అప్పటి నుండి ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ‘గేమ్ చేంజర్’ చిత్రానికి టికెట్ హైక్స్ ఇచ్చారు కానీ, బెన్ఫిట్ షోస్ కి అనుమతిని ఇవ్వలేదు. ఇప్పుడు శివరాత్రికి ఆనవాయితీగా వేసుకునే స్పెషల్ షోస్ ని కూడా రద్దు చేసారు. భవిష్యత్తులో ఎట్టి పరిస్థితిలోనూ సినిమా కారణంగా ఒక్కరి ప్రాణం కూడా పోకూడదని తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో విడుదల కాబోయే పాన్ ఇండియన్ సినిమాలకు కూడా ఇదే పరిస్థితి. అయితే మహేష్ బాబు(Super star mahesh babu) ఫ్యాన్స్ గుంటూరు కారం చిత్రానికి పెద్ద ఎత్తున సెలెబ్రేషన్స్ చేసుకోవడానికి గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నారు. ఈ విషయం పై సోషల్ మీడియా లో వందల కొద్దీ ట్వీట్స్ కూడా వేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ షో రద్దు కావడం తో బాగా నిరాశకి గురయ్యారు.
అల్లు అర్జున్(icon star allu arjun) ని ట్యాగ్ చేసి, నీ వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురు అయ్యాయి అంటూ తిట్టడం మొదలు పెట్టారు. దీంతో నిన్న మొన్నటి వరకు ఎంతో సాన్నిహిత్యం తో మెలిగిన అల్లు అర్జున్, మహేష్ బాబు ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున గొడవలు మొదలయ్యాయి. 2020 వ సంవత్సరం నుండి మహేష్ బాబు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య గొడవలు తార స్థాయిలో ఉండేవి. కానీ గత ఏడాది నుండి అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య విబేధాలు రావడంతో, మహేష్ బాబు అభిమానులు అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో స్నేహం చేయడం మొదలు పెట్టారు. ఈ రెండు ఫ్యాన్ బేస్ లు కలిసి పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేసేవారు. కానీ అకస్మాత్తుగా ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. ఈ గొడవలు సర్దుకుంటాయా?, లేదా ఇంకా పెరుగుతూ పోతాయా అనేది తెలియాల్సి ఉంది.