Kedar Selagamsetty Died
Kedar Selagamsetty : టాలీవుడ్ లో నేడు విషాదం నెలకొంది. అల్లు అర్జున్(Icon Star Allu Arjun), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) వంటి క్రేజీ హీరోలకు అత్యంత సన్నిహితుడు, ఆనంద్ దేవరకొండ తో ‘గం..గం..గణేశం’ వంటి సినిమాని నిర్మించిన నిర్మాత, కేడర్ సెలగంశెట్టి(Kedar Selagamsetty) నేడు దుబాయిలో మరణించాడు. అర్థరాత్రి గుండెపోటు తో ఆయన చనిపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గీత ఆర్ట్స్ సంస్థ లో చాలా కాలం పని చేసిన సెలగం శెట్టి అల్లు కుటుంబానికి అత్యంత ఆప్తుడు. నిర్మాత బన్నీ వాసు తో కలిసి ఎన్నో సినిమాలకు నిర్మాణం లో భాగస్వామ్యం పంచుకున్నాడు. ‘గం గం గణేశం’ తర్వాత ఆయన గెటప్ శ్రీను ని హీరోగా పెట్టి ‘రాజు యాదవ్’ అనే చిత్రం కూడా చేసాడు.ఈ రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యాయి కానీ, సెలగంశెట్టి సినిమాలను నిర్మించడం మాత్రం ఆపలేదు. సినీ రంగం పై ఆయనకు ఉన్నటువంటి ప్యాషన్ అలాంటిది.
గీత ఆర్ట్స్ లోనే ఆయన కొనసాగి ఉండుంటే భవిష్యత్తులో మరో బన్నీ వాసు రేంజ్ నిర్మాత అయ్యాయేవాడేమో. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే డైరెక్టర్ సుకుమార్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో గతంలో ఒక సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి నిర్మాతగా కూడా కేడర్ సెలగం శెట్టి గా వ్యవహరించాల్సి ఉందట. కానీ ఇంతలోపే ఆయనకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఆయన మరణానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా బయటకి రాలేదు. ఇటీవలే టాలీవుడ్ లో ఒక ప్రముఖ నిర్మాత కూతురు పెళ్లి కోసం సెలెబ్రిటీలు మొత్తం దుబాయి కి వెళ్లారు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా మనం చాలానే చూసాము. సెలగం శెట్టి కూడా అలా వెళ్లి ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నాడా?, లేకపోతే వేరే పని మీద వెళ్లి ఇలాంటి పరిస్థితి ఎదురైందా అనేది తెలియాల్సి ఉంది. సెలగం శెట్టి మరణ వార్త విని అల్లు కుటుంబం, విజయ్ దేవర కొండా కుటుంబం తీవ్రమైన విచారం వ్యక్తం చేసారు.