Congress Cabinet Ministers: తెలంగాణ కేబినెట్ : కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు..

బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్, ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్, వివిధ పార్టీల అధ్యక్షులకు ఆహ్వానం పంపారు. కానీ వాళ్లెవరూ రాలేదు.

Written By: Raj Shekar, Updated On : December 7, 2023 4:53 pm

Congress Cabinet Ministers

Follow us on

Congress Cabinet Ministers: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. తొలి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా ఇవాళ రేవంత్‌ రెడ్డి ప్రమాణం చేశారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌.. రేవంత్‌ రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్, ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్, వివిధ పార్టీల అధ్యక్షులకు ఆహ్వానం పంపారు. కానీ వాళ్లెవరూ రాలేదు.\\

మంత్రులుగా 11 మంది.
ఇక తెలంగాణ మంత్రులుగా 11 మంది కూడా ప్రమాణం చేశారు. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్‌ బాబు, తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, జూపల్లి కష్ణారావు, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోద రాజనర్సింహ ప్రమాణ స్వీకారం చేశారు.

మంత్రులకు శాఖల కేటాయింపు..!
కొత్త మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి శాఖలు కేటాయించినట్లు తెలిసింది. హోంశాఖ ఉత్తమ్, పౌరసరఫరాల శాఖ జూపల్లి, నీటి పారుదలశాఖ పొంగులేటి, రోడ్లు భవనాల శాఖ తుమ్మల, గిరిజన సంక్షేమశాఖ సీతక్క, బీసీ సంక్షేమం పొన్నం ప్రభాకర్, మహిళా శిశుసంక్షేమశాఖ కొండా సురేఖ, ఆరోగ్యశాఖ దామోదర రాజనరసింహ, ఆర్థికశాఖ శ్రీధర్‌ బాబు, పురపాలకశాఖ కోమటిరెడ్డి, రెవెన్యూ మంత్రిత్వశాఖ బాధ్యతలు భట్టి విక్రమార్కకు అప్పగించినట్లు తెలుస్తోంది.