https://oktelugu.com/

Telangana Assembly Session 2024: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సీఎం రేవంత్‌.. మాజీ మంత్రి కేటీఆర్‌ మధ్య మాటల యుద్ధం.. ఈ ఇద్దరి ఫైట్ కు కారణం ఇదే

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు వాడీ వేడిగా జరుగుతున్నాయి. ఏడు నెలల క్రితం కొలువుదీరిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మార్చిలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌నే ప్రవేశపెట్టింది. ప్రస్తుత సమావేశాల్లో పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో జూలై 23 నుంచి సమావేశాలు నిర్వహిస్తున్నారు. 9 రోజులు సమావేశాలు జరుగుతాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 24, 2024 / 04:45 PM IST

    Telangana Assembly Session 2024

    Follow us on

    Telangana Assembly Session 2024: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. రెండో రోజు బుధవారం(జూలై 24న) సభ ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. ఇందులో ఆర్టీసీపై సభ్యులు పలు ప్రశ్నలు సంధించారు. వీటికి ఆ శాఖ మంత్రి పొన్నం సమాధానం చెప్పారు. ఈ సమయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుని మాట్లాడారు. ప్రజలు బుద్ధి చెప్పినాం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు బుద్ధి రాలేదని విమర్శించారు. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత కేంద్రం మంగళవారం(జూలై 23న) పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై చర్చకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై చర్చించి తీర్మానం చేయనున్నట్లు ప్రకటన చేశారు. ఈ చర్చను శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. కేంద్రం తెలంగాణపై వివక్ష చూపిందని విమర్శించారు. తెలంగాణలో వెనుకబడ్డ జిల్లాలను కేంద్రం పట్టించుకోలేదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున చేసిన విజ్ఞప్తులను కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం పేరు చెప్పి ఆ రాష్ట్రానికి భారీగా నిధులు ఇచ్చిన కేంద్రం.. అదే చట్టం వర్తించే తెలంగాణకు అన్యాయం చేసిందని విమర్శించారు. దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసిందని పేర్కొన్నరు. తర్వాత ఈ చర్చలో బీఆర్‌ఎస్‌ తరఫున పాల్గొనే అవకాశం స్పీకర్‌ ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు కల్పించారు. కేటీఆర్‌ మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే తీర్మానానికి తమ పార్టీ తరపున పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు. పదేళ్లుగా కేంద్రం తెలంగాణపై వివక్ష ప్రదర్శిస్తూనే ఉందని తెలిపారు. తాము చాలాసార్లు విజ్ఞప్తులు ఇచ్చినప్పటికీ ఎలాంటి సహకారం అందించలేదన్నారు. ఈ విషయం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పుడు అర్థమైందని అన్నారు.

    Also Read: అసెంబ్లీకి కేసీఆర్‌.. ప్రతిపక్ష నేతగా తొలిసారి అడుగు.. బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో సభకు..!

    రేవంత్‌ వర్సెస్‌ కేటీఆర్‌..
    – ఇదిలా ఉండగా కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మాట్లాడుతున్న కేటీఆర్‌ చేసిన కొన్ని వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ మాట్లాడుతుండగానే జోక్యం చేసుకుని మాట్లాడారు. కేసీఆర్‌ కుటుంబం సభను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. ఇటీవలే ఢిల్లీకి వెళ్లి చీకట్లో మాట్లాడుకుని వచ్చిందే మీ అభిప్రాయమా.? అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. చర్చపై మాట్లాడకుండా తాము అది చేశాం ఇది చేశాం అని చెప్పుకోవడాన్ని తప్పు పట్టారు. చీకటి ఒప్పందాలతో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. తాము స్వయం కృషితో అధికారంలోకి వచ్చామని, తండ్రి పేరు చెప్పుకుని రాలేదని కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

    – సీఎం రేవంత్‌రెడ్డి సభలో తనతోపాటు, కేసీఆర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్‌ కూడా ఘాటుగానే స్పందించారు. రేవంత్‌రెడ్డి మేనేజ్‌మెంట్‌ కోటాలో ముఖ్యమంత్రి అయ్యారని తాను అనగలనని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్చకు తాము సంపూర్న మద్దతు ఇస్తున్నామని పునరుద్ఘాటించారు. ఇక చీకటి ఒప్పందాలు చేసుకునే ఖర్మ తమకు పట్టలేదన్నారు. తాము ప్రజలకు చెప్పే ఏదైనా చేస్తామన్నారు. ప్రజల పక్షాన పోరాడతామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసే వరకు ప్రభుత్వాటి వెంటాడతామని, ఉతికి ఆరేస్తామని పేర్కొన్నారు. దీంతో డిప్యూటీ సీంఎ భట్టివిక్రమార్క జోక్యం చేసుకున్నారు. చర్చను తప్పుదోవ పట్టించేలా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కించపర్చేలా సీఎం వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్‌ సభ్యుడు అయి ఉండి ఇలా మాట్లాడడం సరికాదన్నారు. ఇదే సమయంలో స్పీకర్‌ మాట్లాడుతూ బడ్జెట్‌పైనే మాట్లాడాలని సూచించారు. దీనికి స్పందించిన కేటీఆర్‌.. తాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, సభలో ఏం మాట్లాడాలో.. ఏం మాట్లాడకూడతో తనకు తెలుసు అని పేర్కొన్నారు. దీంతో మళ్లీ సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు జోక్యం చేసుకున్నారు. చర్చను తప్పుదోవ పట్టించకుండా మాట్లాడాలని సూచించారు. ఇలా సభలో సీఎం రేవంత్‌రెడ్డి, కేటీఆర్‌ మధ్య మాటల యుద్దం సాగింది.

    Also Read: ఐఐటీ సీటు వచ్చినా.. గొర్రెలు కాసిన విద్యార్థిని.. మీడియా కథనాలతో స్పందించిన సీఎం.. ఆర్థిక చేయూత