Adilabad: మన సమాజం తల్లిదండ్రుల తర్వాత అంతటి గొప్ప స్థానాన్ని ఉపాధ్యాయులకు ఇచ్చింది. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు బతుకు దారిని చూపిస్తాడు. సన్మార్గంలో నడిచేలా ప్రోత్సహిస్తాడు. రాను రాను కొంతమంది ఉపాధ్యాయులు తమ నిర్వాకంతో ఉపాధ్యాయ వృత్తికి కళంకం తీసుకొస్తున్నారు. తమ చేష్టలతో పరువు తీసుకుంటున్నారు. అలాంటి ఒక ఉపాధ్యాయుడి స్టోరీ ఇది.
అది గుమ్మడి ఆదిలాబాద్ జిల్లా. జైలు మండలం సుఖత్ పల్లి లో ప్రభుత్వ పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో విలాస్ అనే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు. అతడు సెకండ్ గ్రేడ్ టీచర్. విద్యార్థులకు పాఠాలు చెప్పి. . వారిని సన్మార్గంలో పెట్టాల్సిన అతడు దారి తప్పాడు. ఏ ఉపాధ్యాయుడు చేయని దారుణానికి పాల్పడ్డాడు. కనీసం సభ్య సమాజం ఏమనుకుంటుందో.. విద్యార్థులు తన తీరు పట్ల ఎలా వ్యవహరో.. అనే కనీస అవగాహన లేకుండా అడ్డగోలుగా ప్రవర్తించాడు. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సింది పక్కన పెట్టి తను మద్యం తాగాడు. ఫుల్లుగా మందు కొట్టి స్కూలుకు వచ్చాడు. విపరీతంగా మద్యం తాగడంతో.. తను ఏం చేస్తున్నానో కూడా మర్చిపోయాడు. మద్యం విపరీతంగా తాగడంతో మత్తులో స్కూల్లోనే పడుకున్నాడు.
తల్లిదండ్రుల ఫిర్యాదుతో….
విలాస్ విపరీతంగా మద్యం తాగి స్కూల్లో పడుకున్న విషయాన్ని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారు స్కూలుకు వచ్చి చూడగా.. విలాస్ గాఢ నిద్రలో కనిపించాడు. దీంతో తల్లిదండ్రులు మొదటి వ్యవహారాన్ని వీడియో తీసి.. అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు ఈ సంఘటనపై విచారణ చేసి.. విలాస్ ను సస్పెండ్ చేశారు. విలాస్ వ్యవహార శైలి పట్ల ఉపాధ్యాయులు కూడా మండిపడుతున్నారు. ఇలాంటి వారి వల్ల ఉపాధ్యాయ లోకానికి చెడ్డ పేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక రోజు గడిస్తే దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తారు. అటువంటి వేళ విలాస్ లాంటి ఉపాధ్యాయుడు ఫుల్లుగా మద్యం తాగి ఇలా పడుకొని ఉండడం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
తాగి స్కూలుకు వచ్చి క్లాస్ రూంలో పడుకున్నాడు.. టీచర్ సస్పెండ్#govtoffice #School #TsGovt #Telangana #Asifabad #GovtSchools #Teacher #teacherstudent #TelanganaNews #OkTelugu #OkTeluguNews pic.twitter.com/llluHYUKD3
— OkTelugu (@oktelugunews) September 4, 2025