OG North America: మరో 21 రోజుల్లో కోట్లాది మంది అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఓజీ'(They Call Him OG) చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా నుండి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ కంటెంట్ కూడా ఆడియన్స్ లో విపరీతమైన క్యూరియాసిటీ ని పెంచుకుంటున్నాయి. ముఖ్యంగా రెండేళ్ల క్రితం విడుదలైన గ్లింప్స్ వీడియో ఈ చిత్రం పై అంచనాలను తారా స్థాయికి తీసుకెళ్లాయి. ఇక రీసెంట్ గా విడుదల చేసిన రెండు లిరికల్ వీడియో సాంగ్స్ కి, అదే విధంగా మొన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి విడుదల చేసిన చిన్న గ్లింప్స్ వీడియో కి కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇలా ప్రతీ కంటెంట్ అంచనాలకు మించి ఉండడం తో ఈ సినిమాకు నార్త్ అమెరికా లో రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి.
అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం నార్త్ అమెరికా లో విడుదలకు 21 రోజుల ముందే 1 మిలియన్ డొల్లరికకు పైగా ప్రీ సేల్స్ ని దక్కించుకున్న ఏకైక ఇండియన్ చిత్రం గా ట్రేడ్ వర్గాలు ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నాయి. ఇది ముమ్మాటికీ నిజమే. కానీ ఈ సినిమాని పవన్ కళ్యాణ్ అభిమానులు ఫాస్టెస్ట్ 1 మిలియన్ ప్రీ సేల్స్ రాబట్టిన సినిమాగా ప్రమోట్ చేస్తున్నారు. అందులో ఎలాంటి నిజం లేదని ప్రభాస్ ఫ్యాన్స్ వాదిస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టిన వారం రోజులకు నార్త్ అమెరికా లో ఓజీ చిత్రం 1 మిలియన్ ప్రీ సేల్స్ మార్కుని అందుకుంది. కానీ #RRR మరియు కల్కి చిత్రాలు కేవలం 6 రోజుల్లోనే 1 మిలియన్ ప్రీ సేల్స్ మార్కుని అందుకున్నాయని, కాబట్టి ఓజీ చిత్రం ఫాస్టెస్ట్ 1 మిలియన్ ప్రీ సేల్స్ రికార్డు ని కొట్టలేదని ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ విషయం లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మరియు ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య చిన్నపాటి వాగ్వాదం ట్విట్టర్ లో జరుగుతుంది.