Sitarama Project: ఖమ్మం మంత్రులదే హవా.. అక్కడి ‘సీతారామ’ పూర్తికే ప్రాధాన్యత

సీతరామ ప్రాజెక్ట పరిధిలోని ఏన్కూరు లింక్‌ కెనాల్‌ నిర్మాణం పూర్తిచేసి 1.20 లోల ఎకరాలకు గోదావరి నీళ్లు అందించేందుకు కసరత్తు చేస్తున్నారు.

Written By: Raj Shekar, Updated On : June 14, 2024 1:13 pm

Sitarama Project

Follow us on

Sitarama Project: తెలంగాణకు సాగునీటి ప్రాజెక్టుల అవసరం ఎంతో ఉంది. గత సీఎం కేసీఆర్‌ దీనిని గుర్తించి కాళేశ్వరంతోపాటు పాలమూరు రంగారెడ్డి, సీతరామ ప్రాజెక్టుల నిర్మాణం మొదలు పెట్టారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ గతేడాది సెప్టెంబర్‌లో కుంగిపోవడం కేసీఆర్‌ సర్కార్‌కు మాయని మచ్చలా మారింది. దానిని సరిద్దే క్రమంలో కొత్త ప్రభుత్వానికి సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో మిగతా ప్రాజెక్టులు అలా కాకూడదన్న సంకల్పంతో ప్రభుత్వం పనులు పర్యవేక్షిస్తోంది. ఈ క్రమంలో పూర్తి కావొచ్చిన ఖమ్మం జిల్లాలోని సీతరామ ప్రాజెక్టు ద్వారా ఈ ఖరీఫ్‌కు ఆయకట్టుకు నీరందించేందుకు కసరత్తు చేస్తోంది.

ఆగస్టు 15న నీటి విడుదల?
సీతరామ ప్రాజెక్ట పరిధిలోని ఏన్కూరు లింక్‌ కెనాల్‌ నిర్మాణం పూర్తిచేసి 1.20 లోల ఎకరాలకు గోదావరి నీళ్లు అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈమేరకు పనులను డిప్యూటీ సీంఎ భట్టివిక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సీతారామ ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో సీతమ్మ సాగర్‌ పనులను పరిశీలించారు. మోటార్ల కోసం ఏర్పాటు చేసిన సబ్‌ స్టేషన్‌ను ప్రారంభించారు.

లింక్‌ కెనాల్‌ ద్వారా ఆయకట్టుకు నీరు..
సీతారామ ప్రాజెక్టు–న్నెస్పీ కెనాల్‌ను లింక్‌ చేయడానికి ఏన్కూరు లింక్‌ కెనాల్‌(9 కి.మీ)ను పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూ.72 కోట్లు మంజూరు చేశారు. ఈ లింక్‌ కెనాల్‌కు రాజీవ్‌ కెనాల్‌గా పేరు పెట్టారు. ప్రస్తుతం మోటార్ల ట్రయల్‌రన్‌ కొనసాగుతోంది. ఆగస్టు 15న నీటిని విడుదల చేసేలా పనులను ముమ్మరం చేశారు.

రంగంలోకి ముగ్గురు మంత్రులు..
ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు భట్టివిక్రమార్క, తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. సీతారామ ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్నారు. ఆరు నూరైనా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని చెబుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడమే తమ లక్ష్యమని అంటున్నారు.